జీతాలు ఎందుకు ఇవ్వడం లేదు, బట్టలు కొనుక్కొనివ్వడం లేదు: ఈటల రాజేందర్
సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైరయ్యారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గొప్పగా ఉంది చెప్తున్నారని.. మరీ నిజమే అయితే ఎందుకు మూడు నెలలుగా రాష్ట్రంలో ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని అడిగారు. తెలంగాణలో పెద్ద పండుగ దసరా. దసరాకు అందరూ కొత్త బట్టలు కొనుక్కుంటారు. వారికి జీతం ఇవ్వకుండా పండుగ చేసుకొనివ్వకుండా.. ఎందుకు వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ప్రశ్నించారు.

వీఆర్ఏలకు స్కేల్ ఇస్తా అని మీరే చెప్పారని.. ఇచ్చిన హామీ నెరవేర్చమని అడిగితే ఎందుకు వేదిస్తున్నారని అడిగారు. వారు ఇచ్చిన అప్లికేషన్ చింపి వారి మొహన్నే కొట్టి ఎందుకు అవమానిస్తున్నారని ఫైరయ్యారు.రుణమాఫీ చేయకుండా 34 లక్షల మంది రైతాంగాన్ని ఎగవేత దారులుగా ఎందుకు చేశారని నిలదీశారు.
తెలంగాణ ధనిక రాష్ట్రం అయితే ఎందుకు తాత్సారం చేస్తున్నారని ఈటల రాజేందర్ సూటిగా ప్రశ్నించారు. చిన్న పనులు చేసిన సర్పంచ్లు, ఎంపీటీసీలు, కాంట్రాక్టర్లకి ఎందుకు బిల్లులు చెల్లించడం లేదని అడిగారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి.. మీరు మాత్రమే ధనవంతులు అవుతున్నారని మండిపడ్డారు.
ప్రధాని మోడీపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని.. ఆయనపై మాట్లాడే ప్రతి మాట కేసీఆర్‌కే వర్తిస్తోందని చెప్పారు. నరేంద్ర మోడీని దేశం కాదు ప్రపంచంలో ఉన్న భారతీయులంతా మెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. కానీ ఊరికే కామెంట్స్ చేయడం సరికాదని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications