వరంగల్ కార్పొరేషన్‌పై కమల వికాసం..?, జితేందర్ రెడ్డి ధీమా..
సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత జితేందర్ రెడ్డి ఫైరయ్యారు. ఆయన ఒంటెద్దు పోకడలతో ప్రజలు తిరస్కరిస్తున్నారని తెలిపారు. ఇందుకు దుబ్బాక ఉప ఎన్నిక గ్రేటర్ ఫలితాలు ఉదహరణ అని తెలిపారు. వచ్చే వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా సత్తా చాటుతామని చెప్పారు. రాష్ట్రంలో ప్రజలు బీజేపీని ప్రజలు విశ్వసిస్తున్నారని.. టీఆర్ఎస్‌ను తిరస్కరిస్తున్నారని వివరించారు. ఇదీ తాము చెప్పే అంశం కాదు అని.. గత ఎన్నికల ఫలితాలతో రుజువు అవుతుందని తెలిపారు.
దుబ్బాక, హైదరాబాద్ మాదిరిగానే వరంగల్ కార్పొరేషన్‌లో బీజేపీ విజయం సాధిస్తోందని జితేందర్ రెడ్డి తెలిపారు. పార్టీ పటిష్టత కోసం వరంగల్‌లో బీజేపీ శక్తి పీఠం సమావేశాలు నిర్వహించగా.. జితేందర్ రెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణ అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. ఈ విషయం ప్రజలు అందరికీ తెలుసు అని చెప్పారు. ఇదీ దాచితే దాగే అంశం కాదని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఏంటో వరంగల్ నగరంలో ఉన్న గుంతలు పడిన రోడ్ల ద్వారా తెలుస్తోందని చెప్పారు. అవే సజీవ సాక్ష్యాలు అని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని చెప్పారు. కేసీఆర్ మోసపూరిత విధానాలే బీజేపీని గెలిపిస్తున్నాయని జితేందర్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ మోసపూరిత మాటలను ప్రజలు విశ్వసించే పరిస్థితుల్లో లేరన్నారు. ఈ విషయం టీఆర్ఎస్ పార్టీకి కూడా తెలిసిందన్నారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications