Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారీ వర్షాల ఎఫెక్ట్: వరంగల్ జిల్లాలో కాకతీయ ఉత్సవాలకు తాత్కాలిక బ్రేక్

వరంగల్ : కాకతీయుల గత చారిత్రక వైభవాన్ని భావితరాలకు అందించే ఉద్దేశంతో, తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటిసారిగా అత్యంత వైభవోపేతంగా నిర్వహించాలని ప్రారంభించిన కాకతీయ ఉత్సవాలు అయిన కాకతీయ వైభవ సప్తాహం కార్యక్రమానికి వరంగల్ జిల్లాలో తాత్కాలిక బ్రేక్ పడింది.

 వరంగల్ జిల్లాలో కాకతీయ ఉత్సవాలకు తాత్కాలిక బ్రేక్

వరంగల్ జిల్లాలో కాకతీయ ఉత్సవాలకు తాత్కాలిక బ్రేక్


తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కాకతీయ ఉత్సవాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు, వర్షాలు తగ్గిన అనంతరం తిరిగి కొనసాగించనున్నట్లు వరంగల్ జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. కాకతీయ ఉత్సవాలు ప్రారంభించిన తొలినాడు, కాకతీయ వారసుడు కమల్ చంద్ర భాంజ్ దేవ్ రాకతో ఉత్సవాలు ఘనంగా ప్రారంభమైనా, ఆ తర్వాతి రోజు నుండి వర్షాల కారణంగా ఉత్సవాలలో అవాంతరాలు ఎదురవుతున్నాయి. దీంతో వర్షాల కారణంగా ప్రభుత్వం ఆశించిన మేర ఘనంగా ఉత్సవాల నిర్వహణ సాధ్యం కావడం లేదు.

కళా ప్రదర్శనలను నిలిపివేస్తున్నట్టు వరంగల్ కలెక్టర్ ప్రకటన

కళా ప్రదర్శనలను నిలిపివేస్తున్నట్టు వరంగల్ కలెక్టర్ ప్రకటన

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరంగల్ లో షెడ్యూల్ ప్రకారం ఈనెల 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహిస్తున్న కాకతీయ వైభవ సప్తాహం సాంస్కృతిక కళా ప్రదర్శనలు తాత్కాలికంగా వాయిదా వేసినట్టు వరంగల్ జిల్లా కలెక్టర్ బి. గోపి వెల్లడించారు. కాకతీయుల కళా వారసత్వాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం నిర్వహిస్తున్న కాకతీయ వైభవ సప్తాహంలో భాగంగా ఖిల్లా వరంగల్ లోని ఖుష్ మహల్ లో వివిధ కళారూపాల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.

కుండపోత వానలతో బయటకు రాని జనం.. కళా ప్రదర్శనలకు తాత్కాలిక బ్రేక్

కుండపోత వానలతో బయటకు రాని జనం.. కళా ప్రదర్శనలకు తాత్కాలిక బ్రేక్

అయితే కుండపోతగా కురుస్తున్న వర్షంలో సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించేందుకు ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించే వేదిక ప్రాంగణమంతా వరద కారణంగా జలమయం కావడంతో కళారూపాల ప్రదర్శనలు తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. మళ్లీ ఈ ప్రదర్శన ఎప్పుడు ఉంటుందన్న విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. కళాకారులు ఎవరు నిరుత్సాహ పడవద్దు అని, షెడ్యూల్ ప్రకటించిన విధంగా మళ్లీ అందరికీ అవకాశం కల్పిస్తామని వరంగల్ కలెక్టర్ గోపి తెలిపారు.

వరద సహాయక చర్యలపై దృష్టి సారించిన అధికార యంత్రాంగం

వరద సహాయక చర్యలపై దృష్టి సారించిన అధికార యంత్రాంగం

ఒకపక్క భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్న కారణంగా, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం పై దృష్టి సారించాలని, వరద సహాయక చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగం రంగంలోకి దిగిన సమయంలో కాకతీయ ఉత్సవాల నిర్వహణను తాత్కాలికంగా బ్రేక్ వేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే సమయంలో సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి వినతుల కార్యక్రమాన్ని కూడా రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+