ప్రత్యేక నిధులు ఏవీ.., కోచ్ వ్యాగన్ మరచవా..? బండి సంజయ్‌పై ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్
వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతుందని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. శనివారం ఆయన వరంగల్‌లో మీడియా మీట్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం, బండి సంజయ్‌పై ఫైర్ అయ్యారు. వరంగల్ పట్టణాభివృద్ధి కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని గుర్తు చేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయమని ఎర్రబెల్లి దయాకర్ రావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వరదలతో నష్టపోయిన హైదరాబాద్ ప్రజలకు కేంద్రం నుంచి ఏం సాయం అందింది అని అడిగారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు ఎన్ని తెచ్చావ్ అని నిలదీశారు. విభజన చట్టం కింద వరంగల్ కోచ్ వ్యాగన్ ఇస్తానని మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ పార్టీయేనని విమర్శించారు.
గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాలకు ఒప్పుకున్న వాటాలను ఇస్తున్నారని.. మరి తెలంగాణ ప్రజలకు న్యాయమైన వాటాలను కేంద్రం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. గ్రేటర్ వరంగల్‌లో కాషాయ జెండా ఎగరబోతోందని బండి సంజయ్ నిన్న కామెంట్ చేశారు. సీఎం కేసీఆర్‌కు మున్సిపల్ ఎన్నికలు అంటే భయం పట్టుకుందని విమర్శించారు. వరంగల్‌లో వరదలు వస్తే బీజేపీ ఆదుకుందని.. రాష్ట్రంలో అధికార పార్టీ నేతల భూ కబ్జాలు పెరిగాయని చెప్పారు.

Recommended Video
అంతేకాదు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని బీజేపీ ఎక్కడా చెప్పలేదని బండి సంజయ్ అన్నారు. వరంగల్ అభివృద్ధి చెందాలంటే బీజేపీ గెలవాలని తెలిపారు. బండి వ్యాఖ్యలకు ఎర్రబెల్లి దయాకర్ కౌంటర్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications