వరంగల్ ఆర్టీఏ ఆఫీస్ దగ్గర నకిలీ వెహికల్ ఇన్సూరెన్సులు చేస్తున్న ముఠా అరెస్ట్ .. వీళ్ళ దందా చూసి పోలీసులే షాక్!

నకిలీ వాహన భీమా పాలసీలు చేస్తున్న రెండు ముఠాలను అరెస్ట్ చేశారు వరంగల్ కమిషనరేట్ పోలీసులు. నకిలీ వాహన భీమా పాలసీలు చేస్తున్న రెండు ముఠాలకు చెందిన 8మంది నిందితులతో పాటు అనాధికారికంగా వాహన రిజిస్ట్రేషన్, లైసెన్సు కార్డులను కలిగి వున్నఆర్టీఏ ఆఫీస్ కార్యకలపాలను నిర్వహించే మరో ఇద్దరు దళారీలను అరెస్ట్ చేశారు. మొత్తం పది మంది నిందితులను టాస్క్ ఫోర్స్, మిల్క్ కాలనీ, ఇంతేజార్ గంజ్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు.

నకిలీ భీమా పాలసీలు చేస్తున్న 8 మంది సభ్యుల రెండు ముఠాలను పట్టుకున్న పోలీసులు

నకిలీ భీమా పాలసీలు చేస్తున్న 8 మంది సభ్యుల రెండు ముఠాలను పట్టుకున్న పోలీసులు

పోలీసులు అరెస్ట్ చేసిన వారి నుండి 4లక్షల 46వేల నగదు, 3 ల్యాప్ ట్యా న్లు , 2 డెస్క్టాప్ కంప్యూటర్లు, 4 ప్రింటర్లు, 5ద్విచక్ర వాహనాలు, వది సెల్ ఫోన్లతో పాటు 433 వాహన రిజిస్ట్రేషన్ మరియు లైసెన్సు కార్డులు, రోడ్డు రవాణా శాఖకు సంబంధించిన రబ్బర్ స్టాంపులు, నకిలీ భీమా పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు అరెస్టు చేసిన వారంతా వరంగల్ ట్రై సిటీస్ కు చెందిన వారే కావడం గమనార్హం. నకిలీ వాహన బీమా పాలసీలు చేస్తున్నవారి అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలను వెల్లడిస్తూ నిందితులందరూ వాహన భీమా మరియు రోడ్డు రవాణా శాఖ దళారీలుగా వరంగల్ రోడ్డు రవాణా శాఖ కార్యాలయము పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్నారని వెల్లడించారు.

నకిలీ భీమా రెన్యువల్ కు టెక్నాలజీని వాడిన కేటుగాళ్ళు

నకిలీ భీమా రెన్యువల్ కు టెక్నాలజీని వాడిన కేటుగాళ్ళు

నిందితులందరు వాహనదారులకు అవసరమయిన వాహన భీమాకు సంబంధించి రెన్యూవల్ చేయించడం, వాహన రిజిస్ట్రేషన్, లైసెన్లను ఇప్పించడం చేసేవారని, అదనంగా ఆదాయం సంపాదించడం కోసం నకిలీ భీమా రెన్యూవల్స్ పై దృష్టి సారించారని సిపి తరుణ్ జోషి వెల్లడించారు. దీనికోసం నిందితులు వివిధ రకాల యాప్స్ తో పాటు వివిధ రకాల సాఫ్ట్ వేర్ లను సేకరించారని పేర్కొన్నారు.

ఈ ముఠాలు ముందుగా తమ వద్దకు వాహన భీమా రెన్యూవల్ చేయించుకోనేందుకు వచ్చేవారిలో అమాయకంగా కనిపించే వారికి నిందితులు ముందుగా రెన్యూవల్ చేయాల్సిన అసలు భీమా పత్రాన్ని తీసుకుని యాప్స్ మరియు సాఫ్ట్ వేర్ ద్వారా అసలు భీమా పాలసీ పత్రంలో సమాచారాన్ని సవరించడంతో పాటు, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా దొరక్కుండా వుండేందుకు టెక్నాలజీని ఉపయోగించి రూపొందించిన నిజమైన భీమాపాలసీ పత్రంగా రూపొందించి వాహనదారులకు అందజేసేవారు.

నకిలీ భీమా రెన్యువల్ అని తెలియక మోసపోయిన వినియోగదారులు

నకిలీ భీమా రెన్యువల్ అని తెలియక మోసపోయిన వినియోగదారులు

ఈ విధంగా నిందితులు ప్రవైయిట్ వాహన భీమా సంస్థలకు సంబంధించి నకిలీ బీమా పాలసీ రెన్యూవల్స్ చేసారు. ఇందుకోసం వాహనదారుల నుండి 2వేల రూపాయల నుండి పదివేల రూపాయల వరకు వసూళ్ళు చేసేవారని తరుణ్ జోషి పేర్కొన్నారు.

ఈ విధంగా నిందితులు గత కొద్ది సంవత్సరాలు ఈ నకిలీ వాహన బీమా పాలసీ రెన్యూవల్స్ చేస్తూ వస్తున్నారని , ఇటీవల కొద్ది రోజుల క్రితం నిందితుల వద్ద వాహన బీమా పాలసీ రెన్యూవల్ చేయించుకున్న వాహనదారుడి వాహనం ప్రమాదానికి గురికావడంతో బీమా సంస్థ పాలసీ రెన్యూవల్ చేయని కారణంగా బీమా వర్తించదని చెప్పటంతో ఖంగుతిన్న వాహనదారుడు తాను మోసపోయినట్లుగా గుర్తించి టాస్క్ ఫోర్స్ కు సమాచారం అందించడంతో ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందని సీపీ పేర్కొన్నారు.

 రవాణా శాఖ కార్యాలయానికి దగ్గరే దందా .. నకిలీ భీమా ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు

రవాణా శాఖ కార్యాలయానికి దగ్గరే దందా .. నకిలీ భీమా ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు

వాహనదారుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన టాస్క్ఫర్స్ పోలీసులు ఇంతేజార్ గంజ్ మరియు మీల్స్ కాలనీ పోలీసులతో కలిసి నిందితుల కార్యాలయాలపై దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి విచారించగా నిందితులు పాల్పడిన మోసాన్ని అంగీకరించడంతో పాటు, రోడ్డు రవాణా శాఖ కార్యాలయములో విధులు నిర్వహించే సిబ్బంది అనధికారికంగా అందజేసిన రిజిస్ట్రేషన్, లైసెన్సు కార్డులు, రోడ్డు రవాణా శాఖ అధికారికి సంబంధించిన రబ్బర్ స్టాంపులను పోలీసులు స్వాధీనం చేసుకోని కేసులు నమోదు చేశారని సీపీ వెల్లడించారు.

నిందితులు ఇప్పటి వరకు దాదాపు పదివేల మంది వాహనదారులను మోసం చేయడంతో పాటు సూమారు 90లక్షల రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని పోలీసుల విచారణలో తెలిసిందన్నారు సీపీ తరుణ్ జోషి .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+