తలపై మోది కిరాతకం.. వరంగల్ జిల్లాలో దారుణ హత్య
కమలాపూర్ : వరంగల్ అర్బన్ జిల్లాలో దారుణ హత్య కలకలం రేపింది. కమలాపూర్ శివారులోని చెరువుకట్ట దగ్గర భైరి రాజనర్సు అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఇతడికి దాదాపు 50 ఏళ్ల వయసుంటుందని పోలీసులు అంచనా వేశారు. బుధవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు రాజనర్సు తలపై మోది చంపారని చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు..

పాత కక్ష్యల నేపథ్యంలో ఈ హత్య జరిగిందా లేదంటే కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కమలాపూర్ మండలకేంద్రంలో నివసించే రాజనర్సు చిరువ్యాపారిగా జీవనం సాగించేవాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.












Click it and Unblock the Notifications