పోలీస్ పెట్రోలింగ్ వాహనానికి యాక్సిడెంట్: ఏఎస్ఐ మృతి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఘనపురం మండలం గాంధీనగరం వద్ద ఆగి ఉన్న ఇసుక లారీని పోలీస్ పెట్రోలింగ్ వాహనం వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏఎస్ఐతోపాటు వాహనంలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. ఏఎస్ఐ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏఎస్ఐ హరిలాల్ ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక నిర్దారణకు వచ్చారు.
పోలీస్ పెట్రోలింగ్ వాహనం ప్రమాదానికి గురి కావడం కలకలం రేపుతోంది. ప్రమాదం జరిగిన/ శాంతి భద్రతల సమస్యలు ఉన్నాయని కబురు వస్తే వాహనం తిరగనుంది. ఈ క్రమంలో వెహికిల్‌కు యాక్సిడెంట్ కావడం.. ఓ ఏఎస్ఐ చనిపోవడం విషాదంగా మారింది. అయితే అతివేగమే ప్రమాదానికి కారణం అని సమాచారం. దీంతో మంచి చెప్పాల్సిన పోలీసులే ఇలా అనే కామెంట్స్ వస్తున్నాయి. ప్రమాదం ఎలా జరిగినా.. పోలీసులదీ కూడా తప్పు ఉందని చర్చ వస్తోంది. కానీ ఓ నిండు ప్రాణం మాత్రం పోయింది.

ఉమ్మడి రాష్ట్రంలో పోలీసులకు పాత జీపులు ఉండేవి. తెలంగాణ ఆవిర్భవించాక.. ఇన్నొవా వాహనాలు, బొలెరో వాహనాలను సమకూర్చారు. సాయుధులైన పోలీసులు.. ఆయా వాహనాల్లో గస్తీ కాస్తున్నారు. అయితే డ్యూటీ కన్నా.. వారు రౌండ్లు తిరగడమే ఎక్కువ అనే విమర్శలు ఉన్నాయి. పోలీసు స్టేషన్ బాసుల పిల్లలకు బాక్సులు/ కూరగాయాలు/ ఇతర పనులు చేయించుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ కొందరీ తీరు మాత్రం మారడం లేదు. ఎవరూ ఎమనుకున్న తమకేంటి అని కొందరు అనుకుంటున్నారు. ఎప్పటిలాగే తమ పనులను చేయించుకుంటున్నారు.
బాధ్యతయుత పదవీలో ఉన్న ఏఎస్ఐ చనిపోవడం బాధ కలిగిస్తోంది. ఘటనకు సంబంధించి ప్రతీ ఒక్కరు జాలి చూపిస్తున్నారు. అయ్యో ఏం జరిగింది..? ఎలా జరిగిందని అందరూ అనుకుంటున్నారు. కానీ ప్రమాదంలో ఏఎస్ఐ మాత్రం విగతజీవిగా మారాడు. కట్టుకున్న వారికి/ సంతానం, తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాడు.












Click it and Unblock the Notifications