వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్ష బీభత్సం .చాలా గ్రామాలకు రాకపోకలు బంద్, వరద ప్రాంతాల్లో మంత్రి ఎర్రబెల్లి !!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. దీంతో ప్రజాప్రతినిధులు, అధికారులు అప్రమత్తమై లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక తాజాగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఈరోజు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి , జిల్లా అధికార యంత్రాంగం తో కలిసి గ్రేటర్ వరంగల్ పరిధిలో వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు.

వర్షాల నేపధ్యంలో అధికారులను అలెర్ట్ చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

ఈ నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులను అప్రమత్తం చేశారు. ఇక విపరీతంగా కురుస్తున్న వర్షాల కారణంగా నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అవ్వటమే కాకుండా, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.

నర్సంపేట నుండి పలు గ్రామాలకు రాకపోకలు బంద్

నర్సంపేట నుండి పలు గ్రామాలకు రాకపోకలు బంద్


నర్సంపేట డివిజన్ లో విపరీతంగా కురుస్తున్న వర్షాలతో నర్సంపేట నుండి మహబూబాబాద్ వెళ్లే జాతీయ రహదారి 365, బుధ రావు పేట వద్ద నిర్మాణ పనులు జరుగుతున్న కల్వర్టు కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. మరోవైపు మహబూబాద్ జిల్లా గూడూరు నుండి నెక్కొండ వైపు వెళ్లే పాకాల వాగు పొంగి ప్రవహిస్తోంది. నర్సంపేట నుండి కొత్తగూడ వెళ్ళే దారిలో ఉన్న గాదె వాగు, గుంజేడు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

కాళేశ్వరం వద్ద 12 మీటర్ల ఎత్తులో గోదావరి.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

నర్సంపేట నుండి సుమారు 50 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినట్లుగా తెలుస్తుంది. పాకాల బ్రిడ్జిపై వరద నీరు పొంగి ప్రవహిస్తుండడంతో రెండు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద 12 మీటర్ల ఎత్తులో గోదావరి నది ప్రవహిస్తుండడంతో, మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ఇప్పటికే ములుగు నియోజకవర్గంలోని ఏటూరునాగారం తదితర ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి ప్రవహించడంతో పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

మహబూబాబాద్, ములుగు జిల్లాలలోనూ పొంగుతున్న వాగులు .. రాకపోకలు బంద్

మహబూబాబాద్, ములుగు జిల్లాలలోనూ పొంగుతున్న వాగులు .. రాకపోకలు బంద్

మోరంచ వాగు, బొగ్గుల వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా లోని డోర్నకల్ నియోజకవర్గంలో ఆకేరు ,మున్నేరు వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది .విపరీతంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఇప్పటికే పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అయితే జిల్లా వ్యాప్తంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు కావాల్సిన సహాయ సహకారాలు అందించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.

English summary
The monsoon continues in the joint Warangal district. The colonies in Warangal city have been inundated with incessant rains for the last three days. Transportation stopped hundreds of villages due the flood overflowed. Authorities were alerted and launched relief efforts. Minister Errabelli dayakar rao visited flood affected areas and instructed to the officials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X