వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ వృద్దుడి కష్టం పగవాడికి కూడా రావొద్దు.. రూ.2 లక్షల నగదు కొరికిన ఎలుకలు

|
Google Oneindia TeluguNews

అంతా నగదుపై ఆధారపడి ఉంది. డబ్బు మూలం ఇదం జగత్ అనీ ఊరికే అనలేదు. దానిని బట్టే హోదా, గౌరవం.. ఇక పేదల విషయానికి వస్తే.. తినడానికి, ఆరోగ్యం బాగలేకుంటే చూపించుకోవడానికి మనీ కంపల్సరీ. అందుకే మనీ మేక్స్ మేనీ థింక్స్ అన్నారు. ఇక విషయానికి వస్తే.. ఓ వృద్దుడు కష్టపడి.. సగం కడుపుకు తిని కూడబెట్టాడు. కొంత అప్పు కూడా తీసుకొచ్చాడు. ఎలాగోలా ఆపరేషన్ చేయించుకుందామని అనుకున్నాడు. కానీ అతనిని విధి వెక్కిరించింది. బీరువాలో దాచిన నగదును ఎలుకలు కొరికేశాయి. దీంతో ఏం చేయాలా రా భగవంతుడా అని ఆ వృద్దుడు తల పట్టుకున్నాడు.

ఆపరేషన్ కోసం కూడబెడితే..

ఆపరేషన్ కోసం కూడబెడితే..

అతను నగదు దాయడానికి బలమైన కారణం ఉంది. ఆపరేషన్ కోసం కష్టపడి సంపాదించిన సొమ్ము దాంతోపాటు అప్పు తెచ్చిన డబ్బును బీరువాలో పెట్టాడు. రేపో మాపో దవాఖానకు వెళదాం అనుకున్నాడు. కానీ నగదును ఎలుకలు కొరికేయటంతో లబోదిబోమంటున్నాడు. మహబూబాబాద్ జిల్లాలో వేంనూర్ శివారు ఇందిరానగర్ తండాలో ఈ ఘటన జరిగింది. కూరగాయలు అమ్ముకుంటూ రెడ్యా జీవిస్తున్నాడు. 4 ఏళ్ల క్రితం అతను అనారోగ్యానికి గురయ్యాడు.

రూ.4 లక్షలు కావాలి..

రూ.4 లక్షలు కావాలి..


ఏం అయ్యిందని మహబూబాబాద్‌లోని ప్రైవేట్ హాస్పిటల్ లో చూపించుకున్నాడు. కడుపులో కణితి ఏర్పడిందని వారు చెప్పారు. హైదరాబాద్ వెళ్ళాలని సూచించగా.. వచ్చి పరీక్షలు చేయించుకున్నాడు. ఆ కణితి ఆపరేషన్‌కు రూ.4 లక్షల వరకు ఖర్చుఅవుతుందని వైద్యులు తెలిపారు. కడుపులో నొప్పి భరిస్తూనే కూరగాయల వ్యాపారం చేశాడు. అలా కూడబెట్టిన సొమ్ము, మరోవైపు అప్పుగా తీసుకొచ్చిన సొమ్ము సుమారు 2 లక్షల రూపాయలను తన ఇంట్లోని బీరువాలో దాచి పెట్టాడు.

ఎలుకలు కొట్టడంతో ఇలా..

ఎలుకలు కొట్టడంతో ఇలా..

ఇక ఆస్పత్రికి వెళ్లే సమయం వచ్చింది. హాస్పిటల్‌‌కు వెళ్దామని బీరువాలోని డబ్బులు తియ్యగా అవన్నీ చిరిగిపోయి.. ఎలుకలు కొట్టినట్టు కనిపించాయి. ఆ చిరిగిపోయిన నోట్లను మార్చుకోటానికి మహబూబాబాద్‌లోని అన్ని బ్యాంకుల చుట్టూ తిరిగాడు. కానీ ఇక్కడ చెల్లవనే సమాధానం వచ్చింది. హైదరాబాద్‌లో రిజర్వ్ బ్యాంక్‌కు వెళ్లాలని, అక్కడ కూడా ఈ నోట్లను తీసుకుంటారో, తీసుకోరో చెప్పలేము అని చెప్పారు. దీంతో ఆ వృద్ధుడు కన్నీటి పర్యంతం అవుతున్నాడు..తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు.

English summary
rats eat old mans 2 lakh currency notes at mahabubabad mandal vemnur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X