మంత్రి కేటీఆర్ వాహనాన్ని ఆపిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. ఏం జరిగిందంటే
నేడు ఐటీ మరియు పురపాలక శాఖామంత్రి కేటీఆర్ వరంగల్ జిల్లాలో పర్యటించారు. వరంగల్‌లోని మడికొండలో ఏర్పాటు చేసిన సైయెంట్, టెక్ మహీంద్రా క్యాంపస్‌లను ప్రారంభించిన ఆయన అక్కడ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఇంటికి వెళ్తున్న క్రమంలో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. మంత్రి కేటీఆర్‌ను ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ అడ్డుకున్న ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది.
అసలేం జరిగిందంటే కేటీఆర్ మడికొండలో సైయెంట్, టెక్ మహీంద్రా క్యాంపస్‌లను ప్రారంభించారు. వరంగల్, కరీంనగరే కాదు రాష్ట్రంలోని అన్ని ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఐటీని విస్తరిస్తాం అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత కాన్వాయ్‌లో కాకుండా ఓ ప్రైవేటు కారును స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ హన్మకొండకు వెళ్ళారు . అక్కడ ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్.. కేటీఆర్‌ను గుర్తించక పోవడంతో కారును నిలిపివేశాడు.

వరంగల్‌లో ఐటీ పరిశ్రమను మంత్రి కేటీఆర్ ప్రారంభించిన అనంతరం అక్కడ నుంచి హన్మకొండలోని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఇంటికి బయల్దేరారు. అయితే మంత్రి కాన్వాయ్‌లో కాకుండా.. ఓ ప్రైవేటు వాహనాన్ని నడుపుకుంటూ ఆయన వెళ్తున్న క్రమంలో ఆ కారులో ఉంది ఐటీ మంత్రి కేటీఆర్ అని తెలియక వాహనం ఆపిన కానిస్టేబుల్ కారులో మంత్రిని చూసి ఖంగు తిన్నారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications