ఎట్టికైనా,మట్టికైనా మనోడే.. ఇంటి పార్టీనే ఉండాలంటూ; వరంగల్లో మంత్రి కేటీఆర్ ఆసక్తికరవ్యాఖ్యలు
వరంగల్, హనుమకొండ జిల్లాలలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నర్సంపేటలో పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్న కేటీఆర్, అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని పేర్కొన్న మంత్రి కేటీఆర్ ఆ రెండు పార్టీల నాయకులు పచ్చి మోసగాళ్లు అంటూ విమర్శించారు. వారిని నమ్మొద్దు ప్రజలకు సూచించారు.

ఏనాటికైనా మన ఇంటి పార్టీనే మనకు శ్రీరామరక్ష
తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ కడుపులో ఉండే బాధ బిజెపి, కాంగ్రెస్ నాయకులకు ఉండదని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఎట్టికైనా, మట్టికైనా మనోడే ఉండాలంటూ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మన పార్టీనే ఉండాలంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఏనాటికైనా మన ఇంటి పార్టీనే మనకు శ్రీరామరక్ష అని కేటీఆర్ కొత్త నినాదాన్ని ఎత్తుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు 29 రాష్ట్రాలలో తెలంగాణ ఒకటని, కానీ మనకున్నది ఒకే ఒక రాష్ట్రం తెలంగాణా అని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

నర్సంపేట లో తక్కువ ధరలో ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్స్
ఇక నర్సంపేట అభివృద్ధిపై మాట్లాడిన మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో 119నియోజకవర్గాలు ఉండగా..ఎక్కడా లేని విధంగా నర్సంపేటలో తక్కువ ధరలో ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్ ఇచ్చి పెద్ది సుదర్శన్ రెడ్డి కొత్త చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో 12,600 గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని పేర్కొన్నారు.
రాష్ట్రమంతా తక్కువ ధరకు గ్యాస్ ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నర్సంపేట అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కితాబిచ్చారు. కార్యకర్త నుండిసర్పంచ్, జడ్పీటీసీ నుండి ఎమ్మెల్యే అయ్యి పేద ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్నాడని పేర్కొన్నారు.

ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చిన ఘనత మన తెలంగాణాదే
100కోట్ల పై చిలుకు నిధులను మంజూరు చేయించుకుని నర్సంపేటలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. 14 ఏళ్ల పాటు కొట్లాడి రోడ్ల మీదకి వచ్చి రాష్ట్రాన్ని సాధించుకున్నామని, బంగారు తెలంగాణ కోసం ఒక్కో అడుగు వేసుకుంటూ పోతున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 75 ఏళ్ళ భారత దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చిన ఘనత మన తెలంగాణాదని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
24 గంటలు కరెంటు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ
కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక నర్సంపేట లో 2 ఇరిగేషన్ ప్రాజెక్ట్ లను మంజూరు చేసుకొని 670 కోట్ల రూపాయలను వెచ్చించి 60 వేల ఎకరాలకి నీళ్లు ఇచ్చామని పేర్కొన్నారు. గతంలో ఎవరైనా చనిపోతే దహన సంస్కారాల కోసం కరెంట్ ఉండేది కాదని, నీళ్ల కోసంస్మశాన వాటిక దగ్గర ఇబ్బంది పడే పరిస్థితి గతంలో ఉండేదని కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. 24 గంటలు కరెంటు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమేనని మంత్రి కేటీఆర్ తెలిపారు.

రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చిన ఏకైక సీఎం కేసీఆర్
ఒక్కో రైతు కి పెట్టుబడి సాయంగా 5000 రూపాయలు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అంటూ పేర్కొన్నారు. ఇక నర్సంపేటలో పసుపు పచ్చిమిర్చి బాగా పండుతుందని, వివిధ పంటల కోసం త్వరలో ఆహారశుద్ధి ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను నర్సంపేటలో నెలకొల్పుతామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications