వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భార్య.. భర్త మధ్యలో అతను; అంతా పోలీసులే... రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవటంతో రచ్చ!!

|
Google Oneindia TeluguNews

వరంగల్: భార్యాభర్తల మధ్య మనస్పర్థలో.. అనుమానాలో.. నిజంగానే భార్యభర్తల మధ్య ప్రేమ రాహిత్యం వల్ల చోటుచేసుకుంటున్న వివాహేతర సంబంధాలో తెలియదు కానీ చాలా కుటుంబాలలో భార్యాభర్తల మధ్య పంచాయితీలు పోలీస్ స్టేషన్ల దాకా వెళ్తున్నాయి. ఇక పోలీస్ స్టేషన్లలో పనిచేస్తూ ఉన్నతాధికారులుగా పదిమందికి ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్పాల్సిన బాధ్యత వున్న పోలీసు అధికారులే రోడ్డుకెక్కి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకున్న ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది.

సీఐడీ ఆఫీస్ లో మహిళా సీఐ, మరో సీఐతో సాన్నిహిత్యం

సీఐడీ ఆఫీస్ లో మహిళా సీఐ, మరో సీఐతో సాన్నిహిత్యం

ఇక అసలు విషయానికి వస్తే వరంగల్ జిల్లాకు చెందిన ముగ్గురు సీఐల కథ ఇది. వరంగల్ నగరంలో రామ్ నగర్ లో నివాసముండే ఓ పోలీస్ అధికారి భార్యాభర్తలు ఇద్దరూ పోలీస్ శాఖలో పని చేస్తున్నారు. భర్త ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలో రూరల్ సీఐగా పని చేస్తున్నాడు. అతని భార్య వరంగల్ సిఐడి కార్యాలయం లో సిఐగా పనిచేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో సదరు మహిళా సీఐ తాను పని చేసే సిఐడి కార్యాలయంలో మరో సీఐ తో సన్నిహితంగా మెలుగుతుంది.

 భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన సీఐ.. మరో సీఐని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఘర్షణ

భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన సీఐ.. మరో సీఐని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఘర్షణ

తరచూ సదరు సీఐ ఇంటికి మహిళా సీఐ, మహిళా సీఐ ఇంటికి సన్నిహితంగా ఉంటున్న సిఐడి కార్యాలయంలో పనిచేస్తున్న సిఐ వస్తూ వెళ్తూ ఉన్నారు. ఈ క్రమంలో భార్య ప్రవర్తన పై అనుమానం వచ్చిన భర్త వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి కోసం చాలా కాలంగా వేచి చూస్తున్నాడు. ఇక తాజాగా బతుకమ్మ పండుగ రోజు సాయంత్రం మహిళా సీఐ ఇంటికి, ఆమెతో సన్నిహితంగా ఉంటున్న మరో సిఐ వచ్చాడు. మహిళా సీఐ ఇంట్లో చాలా సేపు ఉన్నాడు. ఈ విషయం తెలిసిన భర్త వెంటనే తన మిత్రులతో కలిసి వెళ్లి వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని నిలదీశాడు. దీంతో వారిద్దరి మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది.

పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త.. సీఐడీ సీఐ అరెస్ట్

పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త.. సీఐడీ సీఐ అరెస్ట్

తాము ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటున్నామని మహిళా సీఐతో పాటు, తనకు సన్నిహితంగా ఉంటున్న సిఐ కూడా తెలిపారు. అయినప్పటికీ ఆగ్రహంతో ఊగిపోయిన మహిళ సిఐ భర్త సుబేదారి పోలీసులకు ఫోన్ చేశారు. దీంతో పోలీసులు వచ్చి తన ఇంట్లోకి అక్రమంగా వచ్చాడు అన్న భర్త ఆరోపణతో, సీఐడీ ఆఫీసులో పని చేసే సీఐ ను అరెస్టు చేశారు. తన ఇంట్లోకి అక్రమంగా వచ్చాడని, అడ్డుకున్న తనను చంపేస్తానని బెదిరించాడని మహిళా సిఐ భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఈ కేసులో వారిద్దరి మధ్య ఎటువంటి సంబంధం ఉన్నది అన్న అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 తప్పు చేస్తే చెప్పాల్సిన పోలీసులే .. రచ్చకెక్కిన ఘటన

తప్పు చేస్తే చెప్పాల్సిన పోలీసులే .. రచ్చకెక్కిన ఘటన

మొత్తానికి తప్పు చేసిన వారిని శిక్షించి, సరైన మార్గంలో పెట్టాల్సిన పోలీసు ఉన్నతాధికారులు తప్పుడు పనులు చేస్తూ అడ్డంగా బుక్కయిన ఘటనగా ఈ ఘటన చర్చకు కారణమైంది. ముగ్గురు పోలీసులు ఇంటి పంచాయతీని రచ్చకెక్కించుకున్న ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇప్పుడు ఈ వ్యవహారం వరంగల్ జిల్లా పోలీసులలో ఆసక్తికర చర్చకు కారణంగా మారింది.

English summary
In Warangal district husband is working as Rural CI of Mahabubabad, wife is working as CID CI in Warangal. Her husband, caught red-handed, filed a case as she was in close contact with another CI who was working in the CID office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X