వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వరంగల్ లో సీఎం కేసీఆర్ టూర్ .. పెట్రోల్ బాటిల్ తో వృద్ధ దంపతులు .. అసలేం జరిగిందంటే!!

|
Google Oneindia TeluguNews

వరంగల్ అర్బన్ జిల్లాలో గులాబీ దళపతి, తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఓ దంపతుల జంట సీఎం కేసీఆర్ ని కలవడానికి ప్రయత్నించారు. తమ భూమి కబ్జా చేశారంటూ కేసీఆర్ ని కలవడానికి వెళ్లిన దంపతులను పోలీసులు అడ్డుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళారు.

సీఎం కేసీఆర్ గతంలో కేంద్ర కారాగారం ఉన్న స్థలంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భూమి పూజ కు వస్తున్న క్రమంలో కేంద్ర కారాగారం వద్దకు సీఎం కేసీఆర్ ని కలవడానికి వెళ్లిన దంపతుల జంట పోలీసులు కేసీఆర్ ను కలవడానికి నిరాకరించడంతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. వరంగల్ గ్రామీణ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్య పేట గ్రామంలో తమ నాలుగు ఎకరాల భూమిని కబ్జా చేశారని ఆరోపిస్తూ వారు కెసిఆర్ కు తమ గోడును చెప్పుకోవడానికి వచ్చారు.

Warangal CM KCR Tour .. Couple with petrol bottle attempted to suicide

వరంగల్ కొత్త వాడ కు చెందిన గాదం ఓదమ్మ , కట్టయ్య దంపతులు తమతో పాటు పెట్రోల్ బాటిల్ తెచ్చుకొని ఆత్మహత్యాయత్నం చేసుకోవాలని ప్రయత్నం చేయగా గమనించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు.

Warangal CM KCR Tour .. Couple with petrol bottle attempted to suicide

Recommended Video

Telangana లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నకిలీ విత్తన తయారీ దారులు!!

వారి సమస్య తెలుసుకుని వారిని అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ రోజు సీఎం కేసీఆర్ వరంగల్ అర్బన్ జిల్లా పర్యటన నేపధ్యంలో పోలీసులు చాలా కఠినమైన ఆంక్షలు విధించారు. దీంతో ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది .

English summary
A couple who went to meet CM KCR for their land dispute while KCR attends the multi speciality hospital foundation stone , tried to commit suicide . Police rushed them to the police station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X