వరంగల్ కమీషనరేట్ పోలీస్ .. ఆపరేషన్ జంజీర్!!

వరంగల్ కమీషనరేట్ పరిధిలోని వరంగల్ త్రినగరాలలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం ట్రాఫిక్ పోలీసులు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఆపరేషన్ జంజీర్ ను మొదలు పెట్టారు.

వరంగల్ కమీషనరేట్ పరిధిలోని వరంగల్ త్రినగరాలలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం ట్రాఫిక్ పోలీసులు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా మరో సంచలనం నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ట్రాఫిక్ కట్టడి కోసం కఠిన నిర్ణయాలను తీసుకుని వాటిని అమలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు తాజాగా మరో కీలక అడుగు వేశారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు ఆపరేషన్ జంజీర్ ను మొదలు పెట్టారు.

వరంగల్ పోలీసుల కొత్త ప్రయోగం.. ఆపరేషన్ జంజీర్

వరంగల్ పోలీసుల కొత్త ప్రయోగం.. ఆపరేషన్ జంజీర్

ఇప్పటికే వరంగల్ కమీషనరేట్ లో నంబర్ ప్లేట్ల విషయంలో చాలా సీరియస్ గా చర్యలు మొదలు పెట్టారు. ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేయటానికి కూడా ట్రాఫిక్ పోలీసులు వెనకాడటం లేదు. ఇక ఇదే సమయంలో వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడం కోసం రోడ్లపై ప్రధాన సమస్యగా మారుతున్న తోపుడుబండ్ల వ్యాపారం చేసుకునే వారిని, ట్రాఫిక్ అంతరాయం కలిగించకుండా ఉండేవిధంగా ఆపరేషన్ జంజీర్ ను ప్రారంభించారు.

 చిరు వ్యాపారుల తోపుడుబండ్లు రోడ్లపైకి రాకుండా ప్లాన్

చిరు వ్యాపారుల తోపుడుబండ్లు రోడ్లపైకి రాకుండా ప్లాన్


ఇందులో భాగంగా తోపుడుబండ్లపై వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులు ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా తోపుడుబండ్లను నిర్దిష్ట ప్రాంతంలోనే పెట్టుకుని వ్యాపార నిర్వహించుకోవాలి. వారు రోడ్డుపై యధేచ్చగా తిరగటానికి వీలు లేదు. దీనిని కట్టడి చేయడం కోసం వరంగల్ కమిషనరేట్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో హైదరాబాద్ తరహాలో ఆపరేషన్ జంజీర్ నిర్వహణకు ప్రణాళికను రూపొందించారు.

 చిరు వ్యాపారుల తోపుడు బండ్లకు తాళాలు

చిరు వ్యాపారుల తోపుడు బండ్లకు తాళాలు

ఈ ఆపరేషన్ జంజీర్ లో భాగంగా ఉదయాన్నే చిరు వ్యాపారాలు నిర్వహించుకునేందుకు రోడ్లపైకి వచ్చిన తోపుడుబండ్ల వ్యాపారస్తులు తమ తోపుడుబండ్లను అటు ఇటు నడిపిస్తూ ట్రాఫిక్ అంతరాయం కలిగించకుండా ఉండటం కోసం, ఆయా ప్రాంతాలలో విధులు నిర్వహించేవారు తోపుడుబండ్లకు చైన్ తగిలించి తాళం వేసి, ఆ తాళం చెవిని ట్రాఫిక్ పోలీసులు తమ వద్ద ఉంచుకుంటారు. మళ్లీ తోపుడు బండ్ల వ్యాపారస్తులు తిరిగి ఇళ్లకు వెళ్లే సమయం లోనే తోపుడుబండ్లకు తాళాన్ని పోలీసులు తొలగిస్తారు.

వరంగల్ లో ఆపరేషన్ జంజీర్ మొదలుపెట్టిన ట్రాఫిక్ పోలీసులు

వరంగల్ లో ఆపరేషన్ జంజీర్ మొదలుపెట్టిన ట్రాఫిక్ పోలీసులు


ఇక ఈ క్రమంలో సిపి ఏవి రంగనాథ్ ఆదేశాల మేరకు వరంగల్లో ట్రాఫిక్ పోలీసులు ఆపరేషన్ జంజీర్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇన్ఫెక్టర్ బాబులాల్ ఆధ్వర్యంలో వరంగల్ ట్రాఫిక్ పోలీసులు వరంగల్ పోచమ్మ మైదాన్ సెంటర్లో తోపుడుబండ్లకు తాళాలు వేసి ఆపరేషన్ జంజీర్ ఉద్దేశాన్ని వ్యాపారస్తులకు వివరించారు. ఇక దీని వల్ల వరంగల్లో ట్రాఫిక్ సమస్యకు కొంతమేరకు చెక్ పడుతుందని ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు. మరి ఈ ఆపరేషన్ జంజీర్ వరంగల్ ట్రాఫిక్ నియంత్రణలో ఏ మేరకు సత్ఫలితాలను ఇస్తుందో వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+