365 రకాల వంటకాలు.. కాబోయే అల్లుడికి మర్యాద.. ఎక్కడంటే
సంక్రాంతి అంటే కొత్త అల్లుళ్లు.. ఇక గోదావరి జిల్లాలో ఆ మర్యాదే వేరే.. మర్యాదలకు మారుపేరుగా పిలుస్తుంటారు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు రాష్ట్రంలోని పలు జిల్లాలు కళకళలాడుతుంటాయి. ఇంటి ముందు గొబ్బెమ్మళ్లు..రంగు రంగుల ముగ్గులు..హరినాథుల కీర్తనలు...కోళ్ల పందాలు..పిండి వంటలతో మంచి వాసన వస్తుంటాయి. పండుగ శోభతో ప్రతి పల్లె వెలిగిపోతుంటుంది.

అల్లుళ్లకు ఆహ్వానం..
కొత్త అల్లుళ్లను ఇంటికి పిలుస్తుంటారు. వారికి అతిథి.. సత్కరాలు మాములుగా ఉండదు. భోజనం విషయంలో ఇప్పుడు ఓ ట్రెండ్ నడుస్తోంది. ఇంటికి వచ్చే అల్లుళ్లకు భారీ రకాల ఆహార పదార్థాలను వారి ముందు పెడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా కాబోయే అల్లుడిని తాతయ్య ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 365 రకాల వంటకాలతో అతిథ్యం ఇచ్చారు. అన్నం, పులిహోర, బిర్యానీ, దద్దోజనంతోపాటు 30 రకాల కూరలు సిద్ధం చేశారు.

100 రకాల స్వీట్లు
వివిధ రకాల పిండి వంటలు, వంద రకాల స్వీట్స్, 19 రకాల హాట్ పదార్థాలు ఉన్నాయి. 15 రకాల ఐస్‌క్రీమ్స్, 35 రకాల డ్రింక్స్, 15 రకాల కేకులు, 35 రకాల బిస్కెట్లతో ఓ రేంజ్‌లో మర్యాద చేశారు. కేవలం ఆహార పదార్థాలను టేబుల్‌పై సిద్ధం చేయడమే కాదు. అన్ని రకాల పదార్థాలను కుటుంబం అంతా దగ్గరుండి మరీ కాబోయే అల్లుడికి రుచి చూపించారు. వారు చూపించిన అతిథ్యానికి కాబోయే అల్లుడు ఫిదా అయిపోయాడు. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గోదావరి జిల్లాల్లో మర్యాద
ఇటీవల.. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో మర్యాదలు మరీ ఎక్కువ చేస్తున్నారు. ఏదో సందర్భంలో వంటకాలు చేస్తున్నారు. అత్తకు కోడలు, భర్తకు భార్య.. వెరైటీలు అందించి సర్ ప్రైజ్ చేస్తున్నారు. ఈ సారి అల్లుడికి చేసీ మురిపించారు. అత్తింటి వారు చేసి వంటలతో అల్లుడి పొట్ట నిండిపోయింది. అవును వారి ప్రేమను చూసి తట్టుకోలేకపోయారు. ఇంతలా తనపై చూపిన మమకారంతో తల్లడిల్లిపోయాడు. తనకు కాబోయే జీవిత భాగస్వామి కుటుంబం చూపిన ప్రేమతో తెగ సంతోష పడిపోయాడు.