• search
 • Live TV
పశ్చిమగోదావరి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఏపీలో ఆ గ్రామాల అన్నదాతల సంకల్పం .. రైతులే ఇంజినీర్లుగా వేలాడే వంతెన నిర్మాణం

|

పశ్చిమగోదావరి జిల్లా రైతులు తమ సమస్యలను తామే పరిష్కరించుకోవాలి అనుకున్నారు. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా తమ సమస్య పరిష్కారం కాకపోవడంతో వారే ఇంజనీర్ల అవతారమెత్తారు. వీరంపాలెం త్యాజంపూడి గ్రామాలలో 15 వేల మంది జనాభాకు ఆధారమైన బ్రిడ్జి కూలిపోవడంతో, ఆ బ్రిడ్జి నిర్మాణానికి నడుంబిగించారు రైతులు. సంకల్పబలం గొప్పది అని నిరూపించిన రైతులు ఓ అందమైన హాంగింగ్ వంతెన కట్టి ఔరా అనిపిస్తున్నారు.

రైతులపై ఒక్క రూపాయి కూడా భారం పడదు .. విద్యుత్ నగదు బదిలీపై సీఎం జగన్ క్లారిటీ

 పశ్చిమగోదావరి జిల్లా రైతుల పట్టుదలకుబ్ సాక్ష్యంగా వేలాడే వంతెన

పశ్చిమగోదావరి జిల్లా రైతుల పట్టుదలకుబ్ సాక్ష్యంగా వేలాడే వంతెన

వీరంపాలెం త్యాజంపూడి గ్రామాల మధ్య ఎర్రకాలువ పై ఉన్న బ్రిడ్జి, 2018 లో భారీ వరదలతో కొట్టుకుపోయింది. అప్పటినుండి ఆ కాలువ దాటాలంటే బ్రిడ్జి ఆధారం కావడంతో అధికారుల చుట్టూ తిరిగారు రైతులు. రెండున్నరేళ్ళు తిరిగినా పట్టించుకున్న నాధుడు లేరు. దీంతో ఎవరి మీదా ఆధారపడకుండా వంతెన నిర్మించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు గ్రామస్తులు .అనుకున్నదే తడవుగా వేలాడే వంతెన నిర్మించారు. ఆర్ధిక వనరులను రైతులే సమకూర్చుకుని నాణ్యమైన వైర్ లతో వంతెన నిర్మాణం చేశారు.క్రింద పడిపోకుండా ఉండేలా ఐరన్ మెష్ లను కూడా ఏర్పాటు చేసుకున్నారు. తమకు కావాల్సిన వంతెనను తామే నిర్మించుకుని వ్యవసాయ పనులను దాని ద్వారా సాగిస్తున్నారు.

బ్రిడ్జి కూలిపోవటంతో అధికారుల చుట్టూ ప్రదిక్షణలు ..

బ్రిడ్జి కూలిపోవటంతో అధికారుల చుట్టూ ప్రదిక్షణలు ..

ఈ రెండు గ్రామాల ప్రజలు దాదాపు తొమ్మిది వందల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. వ్యవసాయ పనులకు వెళ్లడం కోసం, పశువులకు మేత తీసుకురావడానికి బ్రిడ్జి నుండే వెళ్ళాలి. బ్రిడ్జి వరదలకు కూలిపోవటంతో వారే స్వయంగా వంతెన నిర్మించుకున్నారు. బ్రిడ్జి కూలిపోవడం తో తిరిగి బ్రిడ్జి నిర్మాణం కోసం అధికారుల చుట్టూతిరిగిన రైతులు విసిగి వేసారిపోయారు. రాజకీయ నాయకులను కలిసి తమ గోడు వినిపించారు. ఎవరు రైతుల సమస్యను పరిష్కరించలేదు . కనీసం హామీ కూడా ఇవ్వలేదు. దీంతో రైతులే బ్రిడ్జి నిర్మించాలని ఇంజనీర్లు గా మారారు.

చూడ చక్కనైన హ్యాంగింగ్ వంతెనను నిర్మించారు.

ఆర్ధిక వనరులు వారివే .. వేలాడే వంతెన నిర్మించుకున్న రైతులు

ఆర్ధిక వనరులు వారివే .. వేలాడే వంతెన నిర్మించుకున్న రైతులు

వంతెన ఏర్పాటుతో వారు కాలువను దాటడానికి ఒక వెసులుబాటు కలిగింది రైతుల ఆలోచనతో బ్రిడ్జి నిర్మాణం జరిగింది. అయితే హ్యాంగింగ్ వంతెనను మాత్రమే నిర్మించిన రైతులు కొత్త బ్రిడ్జిని శాశ్వత సమస్యకు పరిష్కారంగా నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రైతు సంక్షేమం కోసం ఎంతో చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం, తమ గ్రామాల మధ్య బ్రిడ్జి ని ఏర్పాటు చేస్తే రెండు గ్రామాల రైతులకు సహాయం చేసినట్లు ఉంటుంది అని అంటున్నారు.

  Ayushman Bharat Yojana : Telangana సహా 4 రాష్ట్రాలకు Supreme Court నోటీసులు జారీ !
   శాశ్వత బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి

  శాశ్వత బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి

  ప్రస్తుతానికి వేలాడే వంతెన మీద రాకపోకలు సాగిస్తున్నా, శాశ్వత ప్రాతిపదికన బ్రిడ్జి నిర్మాణం కోసమే రైతన్నలు ఎదురు చూస్తున్నారు. వర్షాలు వరదలు వస్తే, హ్యాంగింగ్ వంతెన మీద రాకపోకలు సాగించటం ఇబ్బంది అంటున్నారు . మళ్లీ తమకు కష్టాలు మొదలవుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ చూపాలని కోరుతున్నారు. కానీ రైతులు నిర్మించిన వేలాడే వంతెన చూస్తే, వారి సంకల్పం ముందు ఏదైనా చిన్నబోక తప్పదు అన్న భావన కలుగుతుంది.

  English summary
  In the villages of Veerampalam and Thyajampudi, the bridge collapsed due to flood in 2018 . that was the basis for the population of 15 thousand people and the farmers. they asked officials and politicinas to construct the bridge but no use . they constructed themselves a beautiful hanging bridge and farmers have proven that willpower is great .
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X