కేఏ పాల్ కార్లను తీసుకొని, ఇవ్వనంటోన్న రత్నకుమార్.. ఇందుకే గొడవ
కేఏ పాల్.. పాలిటిక్స్‌పై సీరియస్ నెస్ పెంచినట్టు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వరసబెట్టి పర్యటనలు చేస్తున్నారు. ఏ పార్టీ అని లేకుండా.. అందరినీ ఏకిపారేస్తున్నారు. అయితే ఆయనకు కాకినాడలో చేదు అనుభవం ఎదురయ్యింది. డబ్బుల విషయంలో జరిగిన గొడవ అతని కార్లను తీసుకునే వరకు వచ్చింది. రత్నకుమార్ అనే వ్యక్తి పాల్ అండ్ కోకు చుక్కలు చూపించాడు.

కార్లను తీసుకున్న రత్నకుమార్
కాకినాడలో కేఏ పాల్ కార్లను రత్నకుమర్ తీసుకున్నాడు . పాల్ తనకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాలని చెబుతున్నాడు. ఇవ్వమని అడిగితే తననే బెదిరిస్తున్నారని ఆరోపించాడు. నిన్న పాల్ కాన్వాయ్‌లో ఉండే రెండు కార్లను రాత్రి రత్నకుమార్ తన షెడ్‌లో పెట్టుకున్నాడు. ఇవాళ వాటిని తీసుకునేందుకు వచ్చిన పాల్ డ్రైవర్లకు రత్నకుమార్ అనుచరుల నుంచి వ్యతిరేకత వచ్చింది. దీంతో వారు తిరిగి వెళ్లిపోయారు. కేఏ పాల్ డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని, వాటిని ఇచ్చిన తరువాతే వాహనాలను తీసుకెళ్లండని రత్నకుమార్ అనుచరులు మొండికేశారు. కేఏ పాల్‌కు చెందిన బౌన్సర్లు వాహనాలను తీసుకెళ్లేందుకు రాగా.. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. విషయం తెలియడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

చెప్పింది ఇదీ.. చేసింది ఇదీ
రత్నకుమార్ ఉద్దేశ్యపూర్వకంగా ఇలా చేశాడని పాల్ అంటున్నాడు. తన కార్లను ఇక్కడే పార్క్ చేయాలని సూచించాడని చెబుతున్నాడు. ఇవాళ డబ్బులు ఇవ్వాలని చెబుతున్నాడని పాల్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. రత్నకుమార్‌ను గతంలో కేఏపాల్‌తో కలిసి మత ప్రచార సభల్లో పాల్గొన్నారు. తనకు పాల్ పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాలని ఆయన చెబుతున్నారు.

రంగంలోకి పోలీసులు
కేఏ పాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రత్నకుమార్‌కు ఇవ్వాల్సిన డబ్బులను పాల్ గతంలో ఇచ్చారని పాల్ వర్గీయులు చెబుతున్నారు. దీనిపై విచారణ జరిపితే గానీ నిజ నిజాలు వెలుగులోకి రావు. కానీ మరోసారి పాల్ వార్తల్లోకి వచ్చారు. ఈ సారి ఆయన కాన్వాయ్‌లోని రెండు వాహనాలను తీసుకెళ్లి హల్ చల్ చేశారు. అదేంటని అడిగితే డబ్బులు అని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications