Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబును కదిలించిన చిట్టి చేతులు

Rains in AP: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో వరుసగా కుంభవృష్టి తరహా పరిస్థితులు సంభవించాయి. మొన్నటివరకు భారీ వర్షాలు దంచికొట్టాయి. కోస్తా తీర ప్రాంత జిల్లాలను ముంచివేశాయి. ప్రత్యేకించి- రాజధాని అమరావతి సహా ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల కృష్ణానది ఉగ్రరూపాన్ని ధరించింది. వరద నీటితో పోటెత్తింది. కొన్ని రోజులపాటు బుడమేరుకు వరద ప్రవాహం కొనసాగింది. ప్రస్తుతం దీని తీవ్రత భారీగా తగ్గింది. విజయవాడ, అమరావతి ప్రాంతాలు కోలుకున్నాయి. సింగ్‌నగర్‌, చిట్టినగర్‌, సితార, రాజరాజేశ్వరి పేట, యనమలకుదురు, జక్కంపూడి వంటి ప్రాంతాల్లో వరదనీరు పూర్తిగా తగ్గింది.

Viral Video Primary School students donates their pocket money to the Vijayawada flood victims

అదే సమయంలో సహాయక, పునరావాస చర్యలు ముమ్మరం సాగుతున్నాయి ఆయా ప్రాంతాల్లో. అధికార యంత్రాంగం అక్కడే మకాం వేసింది. చిట్టచివరి వ్యక్తి వరకూ సహయక చర్యలు అందేలా చేస్తోంది. అధికార తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తమవంతు సహాయక చర్యలను అందిస్తోన్నారు.

ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తాయి. కోట్ల రూపాయల మేర విరాళాలు అందాయి. టాలీవుడ్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు, చిత్ర నిర్మాణ సంస్థలు, టెక్నీషియన్లు సహాయ నిధికి విరాళాలను అందజేశారు. ఎస్బీఐ ఉద్యోగులు, ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి, ఎంఈఐఎల్, గ్రీన్‌కో వంటి పలు సంస్థలు భారీ విరాళాలను అందించాయి.

తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొందరు పాఠశాల విద్యార్థులు తమ పాకెట్ మనీని విజయవాడ వరద బాధితుల సహాయం కోసం విరాళం ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 31 వేల రూపాయల మొత్తాన్ని వాళ్లంతా విరాళంగా అందజేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

జిల్లాలోని పెంటపాడు మండలంలోని పడమర విప్పర్రులో గల శ్రీ విద్యా నికేతన్ పాఠశాలకు చెందిన చిన్నారులు వాళ్లంతా. ఈ వీడియోను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఆ చిన్నారులపై పొగడ్తల వర్షం కురిపించారు. ఈ చిన్నారులు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు.

విద్యార్థుల్లో ఇలాంటి ఉదాత్తమైన విలువలను పెంపొందించడం పట్ల స్కూలు యాజమాన్యాన్ని అభినందిస్తున్నానని అన్నారు. వారిని బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దందని అన్నారు తోటివారి పట్ల శ్రద్ధ చూపాలంటూ వారికి ప్రాథమిక విద్య దశలోనే బోధించడం సమాజానికి మేలు చేసినట్టవుతుందని పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+