సైకిల్ గుర్తుకు ఓటేయాలంటూ వైసీపీ ఎమ్మెల్యే ప్రచారం: అంతా షాక్, వైరల్ వీడియో

పశ్చిమగోదావరి: రాజకీయ నాయకులు అప్పుడప్పుడు తమ ప్రసంగాల్లో పొరపాట్లు చేస్తూనే ఉంటారు. తమ పార్టీ ఏదో కూడా మార్చి ప్రత్యర్థి పార్టీలకు ఓటేయాలంటూ పిలుపునిస్తుంటారు. ఆ తర్వాత నాలుక్కర్చుకుని తమ తప్పులను సరిచేసుకుంటుంటారు. తాజాగా, ఓ వైసీపీ ఎమ్మెల్యే కూడా అదే పనిచేశారు.

పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు ఎమ్మెల్యే ఉప్పాల వాసుబాబు పరిషత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి జయలక్ష్మి, ఎంపీటీసీ అభ్యర్థి గంటా శ్రీలక్ష్మి తరపున ఉంగుటూరు మండలం గోపీనాథపట్నంలో ఎమ్మెల్యే ప్రాదేశిక ఎన్నికల ప్రచారానికి వెళ్లారు.

ysrcp mla urges voters to vote for cycle.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుబాబు మాట్లాడుతూ.. సైకిల్ గుర్తుకు ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అప్పటి వరకు ఓటర్ల వైపు దండం పెడుతూ నిల్చున్న వైసీపీ అభ్యర్థులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ప్రచారం వాహనం చుట్టూ చేరినవారు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. మరికొందరు నవ్వుకున్నారు.

వెంటనే సర్దుకున్న ఎమ్మెల్యే వాసుబాబు.. సైకిల్ గుర్తుపై ఓటేయాలంటూ జోక్ చేశానని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే తన వ్యాఖ్యలను సరిచేసుకున్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం ఆయన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

కాగా, పరిషత్ ఎన్నికలను తెలుగుదేశం పార్టీ బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఆయన నిర్ణయంపై సొంతపార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అశోక్ గజపతిరాజు లాంటీ సీనియర్ నేతలతోపాటు స్థానిక నేతలు కూడా వ్యతిరేకిస్తున్నారు. పలువురు టీడీపీ అఅభ్యర్థులు పోటీలో కూడా దిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+