బంగారు పల్లెంలో పెట్టి ఇచ్చినట్టేనా?
లండన్: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ మ్యాచ్ రెండో రోజు కూడా భారత్‌పై ఆస్ట్రేలియాదే పైచేయి. తొలి ఇన్నింగ్‌లో ఆసీస్‌ను 469 పరుగుల వద్ద కట్టడి చేసిన తరువాత బ్యాటింగ్‌కు దిగిన భారత్- తడబడింది. క్రీజ్‌లో కుదురుకోవడంలో రోహిత్ సేన విఫలమైంది. రెండో రోజు మ్యాచ్ ముగిసే సమయానికి సగంమంది బ్యాటర్లు పెవిలియన్ చేరారు. ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యాన్ని సాధించినట్టే కనిపిస్తోంది.
327 పరుగులతో రెండో రోజు ఆటను ఆరంభించిన ఆసీస్ బ్యాటర్లను భారత బౌలర్లు ఎట్టకేలకు భయపెట్టగలిగారు. వరుస వికెట్లను తీసుకోగలిగారు. ట్రావిస్ హెడ్ 146, స్టీవెన్ స్మిత్ 95 పరుగులతో రెండో రోజు ఆటను ఆరంభించారు. 163 పరుగుల వద్ద ట్రావిస్ హెడ్, 121 పరుగులు చేసిన తరువాత స్టీవెన్ స్మిత్ అవుట్ అయ్యారు. వారిద్దరి తరువాత ఆ స్థాయిలో మిగిలిన బ్యాటర్లెవరూ భారీ పరుగులు చేయలేదు.

లోయర్ మిడిలార్డర్‌లో అలెక్స్ క్యారీ ఒక్కడే 48 పరుగులు చేశాడు. 500లకు పైగా పరుగులు చేయగలుగుతుందనుకున్న ఆస్ట్రేలియా ఇన్నింగ్ 469 వద్దే నిలిచింది. భారత బౌలర్లల్లో మహ్మద్ సిరాజ్ తడాఖా చూపించాడు. నాలుగు వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ షమీ, శార్దుల్ ఠాకూర్ రెండు చొప్పున, రవీంద్ర జడేజా ఒక వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఇన్నింగ్ ప్రారంభంలో ఏ మాత్రం కూడా ప్రతిఘటించలేకపోయింది. బ్యాటర్లు క్రీజ్‌లో కుదురుకోవడానికి ఇబ్బందులు పడ్డారు. ఓపెనర్లు రోహిత్ శర్మ- 15, శుభ్‌మన్ గిల్-13 పరుగులకే పెవిలియన్ చేరారు. చేతేశ్వర్ పుజారాదీ అదే పరిస్థితి. 14 పరుగులే చేసిన కామెరాన్ గ్రీన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. విరాట్ కోహ్లీ సైతం విఫలం అయ్యాడు. 14 పరుగులే చేసి వెనుదిరిగాడు.

71 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయిన దశలో రవీంద్ర జడేజా, అజింక్య రహానె ఇన్నింగ్‌ను చక్కదిద్దారు. అయిదో వికెట్ భాగస్వామ్యానికి 71 పరుగులు జోడించారు. ఇదే హయ్యెస్ట్ పార్ట్‌నర్‌షిప్. ఇన్నింగ్ గాడిలో పడిందనుకున్న దశలో లియాన్ దెబ్బకొట్టాడు. రవీంద్ర జడేజాను బలి తీసుకున్నాడు. 48 పరుగులు చేసి జడేజా లియాన్ బౌలింగ్‌లో స్టీవెన్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అప్పటికి జట్టు స్కోర్ 142.

అజింక్య రహానె-29, వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్-5 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ అయిదు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. 318 పరుగుల మేర ట్రయలింగ్‌లో ఉంది. మ్యాచ్‌పై పట్టు సాధించాలంటే మాత్రం మూడో రోజు బ్యాటర్లు క్రీజ్‌లో నిలదొక్కుకోవాల్సి ఉంటుంది. చేతిలో ఆరు వికెట్లే ఉన్న నేపథ్యంలో టీమిండియా భారీ స్కోర్ సాధిస్తుందనే నమ్మకం సన్నిగిల్లింది.












Click it and Unblock the Notifications