వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డెట్రాయిట్ బతుకమ్మ

By Staff
|
Google Oneindia TeluguNews


Batukamma Festival in Detroit డెట్రాయిట్ బతుకమ్మ ఆర్గనైజేషన్ నిర్వహించిన బతుకమ్మ ఉత్సవానికి విశేష స్పందన లభించింది. దాదాపు 650 మంది ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. డెట్రాయిట్ నుంచే కాకుండా లాన్సింగ్, జాక్సన్, కెనడాల నుంచి తెలంగాణకు చెందిన ఎన్నారైలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మధ్యాహ్న భోజనం అనంతరం ఉత్సవం ప్రారంభమైంది. శైలేంద్ర సనమ్ యాంకరుగా వ్యవహరించారు. వనితా రెడ్డి బతుకమ్మ చారిత్రకత, విశిష్టతలపై మాట్లాడారు. అమెరికాలో బతుకమ్మ పండుగ నిర్వహణ గురించి హరి మారోజు మాట్టాడారు. సభ్యులను, వాలంటీర్లను రాంరెడ్డి ఆర్గనైజింగ్ కమిటికి పరిచలం చేశారు

అనంతరం పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. మనీష, శ్రావ్యల ప్రార్థనా శ్లోకంతో అవి ప్రారంభమయ్యాయి. ఐదేళ్ల సింధు, అపూర్వ అన్నమయ్య కీర్తనకు శాస్త్రీయ నృత్యం చేయడం అందరినీ ఆకట్టుకుంది. మానస, విఖ్యాతి, నమ్రత సినిమా పాటలకు నర్తించారు. అంచిత తెలంగాణ జానపద గీతం ఆలపించింది. వైష్ణవి రామదాసు కీర్తన పాడింది. బతుకమ్మ పోటీల్లో వసంతకు మొదటి బహుమతి, సుభాషిణికి రెండవ బహుమతి, శ్రీలతకు మూడవ బహుమతి లభించాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X