ఉప ఎన్నికల ఓట్లపై ఎన్నారైలు

ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీలోని, పరిసర ప్రాంతాల్లోని తెలంగాణ ఎన్నారైలు ఈ నెల 9వ తేదీన తెలంగాణ రాష్ట్రానికి ఉప ఎన్నికల ఓట్లు అనే అంశంపై కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం ఆస్ట్రేలియా చాప్టర్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పిల్లలు, పెద్దలు 115 మంది దాకా పాల్గొన్నారు. ఓలింపిక్ పార్కుకు ఎదురుగా ఉన్న దుండాస్ చర్చి హాల్లో ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణ మాతృభూమిపై ఈ కార్యక్రమంలో చర్చించారు. ఉప ఎన్నికల ఫలితాల పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.

తెలంగాణ అంశానికి అనుకూలంగానే ఓట్లు పడ్డాయని అందరూ అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి కాంగ్రెస్, తెలుగుదేశం, బిజెపి, సిపిఐ ఓట్లు అడిగాయని టిడిఎఫ్ సమన్వయకర్త వినోద్ ఏలేటి చెప్పారు. అందుకు సాక్ష్యాంగా ఆయన పత్రికల క్లిప్పింగులను చూపించారు. తెలంగాణ ప్రజలు అమాయకులని, పార్టీలు ఇచ్చిన రాజకీయ ప్రకటనలను లోతుగా విశ్లేషించుకోలేకపోయారని ఆయన అన్నారు. ఆ పార్టీలన్నీ తెలంగాణ రాష్ట్రం తెస్తాయని ప్రజలు నమ్మారని, దీంతో తెలంగాణ ఓట్లను ఆ పార్టీలన్నీ పంచుకున్నాయని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి ఓట్ల శాతం ఎక్కువగా ఎక్కువగా రావడం పట్ల, ఆ పార్టీకి ఎక్కువ పార్లమెంటు సీట్లు, శాసనసభ సీట్లు రావడం పట్ల టిడిఎఫ్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత ప్రభుత్వ ఏర్పాటులో తెరాస కీలక పాత్ర పోషిస్తుందని వారు అభిప్రాయపడ్డారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తున్నారని, ఇది కేవలం సెంటిమెంటు కాదని, ఇది శాస్త్రీయమైన, సాక్ష్యాధారాలతో కూడిన డిమాండ్ అని వినోద్ అన్నారు. తెలంగాణ వంటకాల రుచిని కార్యక్రమంలో పాల్గొన్నవారు ఆనందించారు. మాధవ్, నిరుపమ, ఇంద్రసేనారెడ్డి, ప్రమోద్, దేవేందర్, చంద్రకళ, జయపాల్, నరేష్, కవిత, వేణుగోపాల్, కరుణ, రవికాంత్, పాపిరెడ్డి, అశ్విన్, కిరణ్, నర్సింహారెడ్డి, చంద్రశేఖర రెడ్డి ఈ కార్యక్రమ ఏర్పాట్లు చూశారు.

13 ఏళ్ల బాలుడు ఆశీష్ ఏలేటి చూపిన నిబద్ధత అందర్నీ ఆకర్షించింది. అతను ఒక డివిడిని రూపొందించాడు. ఈ డివిడిని 2009 ఎన్నికల ప్రచారంలో టిడిఎఫ్ ఆస్ట్రేలియా చాప్టర్ వాడుకోనుంది. ఈ 8 ఏళ్ల ఆశీష్ ఏలేటి అందరి అభినందనలను అందుకున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+