అమెరికాలో గోపాల్ రెడ్డికి ఎన్నారైల సత్కారం

విశ్వవిద్యాలయంలోని రసాయన శాస్త్రం, మైక్రో బయోలజీ, గణిత శాస్త్రం, ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల్లో 14 మాస్టర్స్ ప్రోగ్రామ్స్ ల్లో 850 మంది విద్యార్థుల చదువుతున్నట్లు, తాజాగా ఫార్మసీ స్కూల్ ను చేర్చినట్లు గోపాల్ రెడ్డి చెప్పారు. వెనకబడిన మహబూబ్ నగర్ జిల్లాలో విశ్వవిద్యాలయాన్ని వేగంగా అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. విశ్వవిద్యాలయానికి అకడమిక్, ఫైనాన్షియల్ సాయం అందిస్తున్న పాలమూరు ఎన్నారైలు చేస్తున్న సాయాన్ని ఆయన అభివందించారు. అమెరికాలోని విశ్వవిద్యాలయాల అకడమిక్ సహకారాన్ని తీసుకోవడానికి ఎన్నారైలు తోడ్పడగలరని ఆయన ఆశించారు. గ్రంథాలయం, హాస్టల్, లెక్చర్ హాల్ వంటి వసతుల కల్పనకు ముందుకు రావాలని ఆయన ఎన్నారైలను కోరారు. ప్రొఫెసర్ కాంతారెడ్డి, దయాసాగర్ రావు వంటి ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.












Click it and Unblock the Notifications