Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమెరికా సిలికాన్ వ్యాలీలో సమైక్యాంధ్ర గళం

NRI
సిలికా వ్యాలీ: 'సమైకాంధ్ర ప్రదేశ్‌ ప్రగతికి సంకేతం' అని దాదాపు ఐదు వందల మంది ప్రవాసాంధ్రులు అమెరికా సిలికాన్‌ వేలీలో గళమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకి చెందిన అనేక మంది ప్రవాసాంధ్రులు కాలిఫోర్నీయా, మిల్పీటస్‌ నగరంలోని సెర్రా థియేటర్స్‌ ప్రాంగణంలో సమావేశమై సమైకాంధ్రప్రదేశ్‌కు మద్దతు ప్రకటించారు.

ఈ సభలో సమైకాంధ్రప్రదేశ్‌పై ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. భక్త భల్లా, చైతన్యరెడ్డి, వెంకట్‌ మద్దిపాటి, శ్రీనివాస్‌ వేముల, సతీష్‌ అంబటి, తులసి తుమ్మల శ్రీకాంత్‌ కోనేరు తదితరులు నిర్వహించిన ఈ సభలో రాజకీయ అవకాశవాదాన్ని ఆసరాగా తీసుకుని తెలుగు వారి మధ్య విభేదాలు సృష్టిస్తున్నారనీ పలువురు వక్తలు ఆవేశంగా ప్రసంగించారు.

వెనుకబాటు తనానికి వేర్పాటు వాదాలు పరిష్కారం కాదనీ, అవి అభివృద్ది వైపు తీసుకెళ్ళలేవని ఆవేదనతో అన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే తెలుగు వారి ప్రగతే ముక్కలైపోతుందని అన్నారు. సమైకంగా ఉంటేనే అభివృద్ది సాధించడం సులభతరం అవుతుందన్న అభిప్రాయాలను వ్యక్తీకరించారు.

ఐటి రంగంలో హైదరాబాద్‌ ఎంతో ప్రగతి సాధించిందనీ, ఆ విజయం తెలంగాణ, కోస్తా, రాయలసీమ ప్రాంతాల వారందరిదీనని గుర్తు చేశారు. ఎవరినీ సంప్రదించకుండా, ఆఖరికి ముఖ్యమంత్రికి కూడా తెలియకుండా చేసిన తెలంగాణ ప్రత్యేక ప్రకటన, అదీ అర్ధరాత్రి హడావుడిగా నిర్ణయాన్ని ప్రకటించడం పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేసారు. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే అభివృద్ది కుంటుపడుతుందని మరికొందరు వక్తలు ప్రసంగించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+