ఉత్తర అమెరికాలో అమర గాయకుడు పద్మశ్రీ ఘంటసాల స్వరమాధురి జరగనుంది. ఆయన 88వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటైంది. ప్రప్రథమంగా అమెరికాలో నిర్విరామంగా 12 గంటల పాటు ఘంటసాల స్వరరాగ మహాయాగం జరుగుతుందని వంగూరి చిట్టెన్ రాజు తెలిపారు. హూస్టన్ లోని ఆర్య సమాజ్ మందిరంలో డిసెంబర్ 4వ తేదీ ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. హూస్టన్ లోని తెలుగు సాంస్కృతిక సమితి, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, హైదరాబాదులోని ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్టు, హైదరాబాదులోని వేగేశ్న ఫౌండేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.