• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో బ్లాక్ డేగా నవంబర్ 1

By Pratap
|
Google Oneindia TeluguNews
NRI
వాషింగ్టన్ డి సి ఏరియా తెలంగాణా ఎన్న్నారైలు నవంబరు 1వ తేదీని తెలంగాణా విద్రోహ దినంగా పాటించాలని, యావత్తు తెలంగాణా ఈ రోజును బ్లాక్ డే గా పరిగణించాలని పిలిపునిచ్చారు. 56 ఏళ్ళ క్రితం మోస పూరితంగా, తెలంగాణా ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఆక్రమించిన రోజు ఖచ్చితంగా విద్రోహ దినమేనని ప్రకటించారు. ఒక నాడు సంపన్న వంతమైన హైదరాబాద్ రాష్ట్రాన్ని తమ కాలనీ గా మార్చుకుని తెలంగాణ ప్రజల సొమ్మును, వనరుల్ని నిరాఘాటంగా దోచుకుంటూ నిస్సిగ్గుగా సమైక్యవాదం జపిస్తున్న ఈ ఆంధ్రా జంబూకాల్నితరిమి కొట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రుల రాక్షస పాలనకి అతి త్వరలో తెర పడనుందని, మన తెలంగాణా బ్రతుకుల్లో చీకటి రోజులు తొలిగి వెలుగులు నిండే రోజు ఎంతో దూరంలో లేదని చెప్పారు.

తెలంగాణా ఉద్యమంలో విద్యార్థులకి ప్రధాన పాత్ర ఉందని వారే ఈ ఉద్యమాన్నినడిపించాలని, ప్రజలని చైతన్య వంతుల్ని చేసి త్వరగా తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు పాటు పడాలని పిలుపునిచ్చారు. మన ఇంట్లోకి వచ్చి, మన నోటి దగ్గర కూడు లాక్కుంటూ, మనకే తెలియకుండా మన చెడ్డీలు దొంగ తనం చేస్తున్న ఈ ఆంధ్రా దొంగ నాయకుల్నితెలంగాణా పొలిమేరల వరకు తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణా ఎన్నారైలందరూ తెలంగాణా ప్రజల వెన్నంటే ఉన్నారని, అన్ని రకాల సహాయం చేస్తామని, డిసెంబర్ 31 తరువాత అవసరమైతే తాము కుడా ప్రత్యక్ష పోరాటంలో పాల్గొంటామని ప్రకటించారు. ఆంధ్రా పాలకుల ప్రభుత్వంలో అప్రాధాన్య శాఖలతో చేవ లేని, గౌరవం లేని బతుకులీడుస్తున్న తెలంగాణా రాజకీయ నాయకులందరూ ఇప్పటికైనా తెలంగాణా పట్ల చిత్తశుద్ధితో ఆంధ్రా పాలనకి చరమ గీతం పాడాలని, తాము ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రజల అభిప్రాయాలని గౌరవించి ప్రభుత్వం నుండి బయటకు వచ్చి ఉద్యమాన్ని ముందుకు నడిపించి, కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకత్వం, సోనియా దిగి వచ్చి నాన్చకుండా, వెంటనే తెలంగాణా ఇచ్చేలా చేయాలనీ విజ్ఞప్తి చేశారు. తెలంగాణా జాతి పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని విజ్ఞప్తి చేశారు.

పుట్ట గొడుగుల్లా నిబంధనలకు వ్యతిరేకంగా వెలుస్తున్న భారత దేశ చరిత్రలోనే అత్యంత అవినీతి పరుడైన వై.ఎస్.ఆర్ విగ్రహాలకు లేని అభ్యంతరాలు రంగారెడ్డి కోర్టు ముందు తెలంగాణా తల్లి విగ్రహానికి పెట్టడం ప్రభుత్వ, ఆంధ్ర అధికారుల వివక్షకు నిదర్శనమని చెప్పారు. శాంతి యుతంగా ప్రదర్శనలు చేసే తెలంగాణా పౌరులపై ప్రభుత్వ దమన కాండ సహించ బోమని, వారిపై పశు బలం ప్రయోగించడం అప్రజాస్వామికమని, వారి ముందస్తు అరెస్టులు ప్రభుత్వ దివాళాకోరు తనానికి నిదర్శనమని, అన్యాయంగా అరెస్ట్ చేసిన తెలంగాణా వారిని విడిచి పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే ఇంతవరకు విద్యార్థులపై బనాయించిన కేసులన్నీ వెంటనే ఉపసంహరించాలని కోరారు. ఈ సమావేశంలో డి.పి.రెడ్డి, జగదీష్ బొందుగుల, వేణు నక్షత్రం, కృష్ణ దొమ్మాట, రాజేష్ మాదిరెడ్డి, విజయ్ చాట్ల, రమణ కంచేటి, రవి పల్ల, రాంరెడ్డి జక్క, అరవింద్, నర్సింగ్ రావు, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X