భార్యలను కాపాడబోయి ఇద్దరు మృతి

బాయిలర్ తయారీ పరిశ్రమలో పనిచేసే పవన్ ఇటీవలే ఆస్ట్రేలియాకు కుటుంబంతో సహా వచ్చారు. ఆ దంపతులకు రోహిత్ (8), నీహార్ (7) అనే ఇద్దరు కొడుకులున్నారు. వాళ్లకింకా తమ తండ్రి మరణవార్త తెలియదు. వీరు నదిని దాటేటప్పుడు వీరితో పాటు ఉన్న ఇద్దరి భార్యలతో పాటు మరో ఇద్దరిని సమీపంలో ఉన్న రాకింగ్‌హామ్, ఫ్రెమాంట్లె ఆస్పత్రులకు తరలించారు. కుటుంబ సభ్యులు, పిల్లలు, స్నేహితులతో కలిసి వీరంతా అక్కడున్న దీవిలోకి పిక్నిక్ కోసం వచ్చారు. మిగిలినవాళ్లంతా ఒక ఫెర్రీలో ఒడ్డు కు చేరుకున్నారు. అక్కడి నుంచే ఆ విషాద దృశ్యాన్ని కళ్లారా చూసి విలపించారు. మధ్యా హ్నం పూట బలమైన గాలులు వీస్తుండటం వల్ల ఈ ప్రాంతంలో జలక్రీడలకు ప్రజలను ఇన్నాళ్లుగా అనుమతించట్లేదు. తాము ఎంతగా హెచ్చరించినా ప్రజలు వెళ్తూనే ఉన్నారని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ కన్జర్వేషన్‌కు చెందిన మైనెమా తెలిపారు.












Click it and Unblock the Notifications