దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో జరుగుతున్న 4వ ప్రవాస్ భారతీయ దివస్ సదస్సుకు హాజరైన కేంద్రమంత్రులు వాయలార్ రవి, దగ్గుబాటి పురందేశ్వరిలకు ఘన స్వాగతం లభించింది. మహాత్మాగాంధీ 142వ జయంతి సందర్భంగా 'రిలవెన్స్ ఆఫ్ గాంధీ' పేరుతో జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో గాంధీ మనుమరాలు ఇలా గాంధీ, జింబాబ్వే సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఇబ్రహీం ప్రభృతులు పాల్గొన్నట్లు పురందేశ్వరి కార్యాలయం ఆదివారం విశాఖలో విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఆమె ఈనెల 7న విశాఖకు తిరిగి వస్తారు.