వంగూరి ఉత్తమ రచనల పోటీ విజేతలు

ఈ పోటీలోని అన్ని ప్రక్రియలలోనూ అమెరికా, కెనడా, కెన్యా, ఇథియోపియా, ఐరోపా దేశాలనుండి చాలా మంది రచయితలు పాల్గొనడం ఎంతో ఆనందం కలిగించిందని ఆయన అన్నారు. ఈ సంవత్స్రరం లో ప్రవేశ పెట్టిన "నా మొట్టమొదటి కవిత" ప్రక్రియకీ, రెండవ సారి నిర్వహించిన "నా మొట్టమొదటి కథ" ప్రక్రియకీ చాలా మంది సరికొత్త కవులూ, కథకులూ పాల్గొనడం విదేశాలలో తెలుగు సాహిత్య వికాసానికి శుభసూచకమని ఆయన అభిప్రాయపడ్డారు. విజేతలుగా ఎంపిక అయిన రచనలతో పాటు, ఇతర మంచి రచనలు "కౌముది.నెట్" అంతర్జాల పత్రిక, మరియు "రచన" మాస పత్రిక (హైదరాబాదు) లోనూ ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు.
బహుమతి ప్రదానం జూలై 16-17, 2011 వ తారీకులలో హ్యూస్టన్, టెక్సస్ లో జరగబోయే ప్రతిష్టాత్మక "మూడవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు" లో ప్రత్యేక ఆహ్వానితులైన ప్రముఖ సాహితీవేత్తల చేతుల మీదుగా, సభాముఖంగా జరుగుతుందని చెప్పారు. విజేతల వివరాలు ఇలా ఉన్నాయి -
“నా మొట్టమొదటి కథ" - విభాగం విజేతలు
"తల్లి కాకి-పిల్ల కాకి" – "చిలుకూరి సత్యదేవ్", హ్యూస్టన్
"సంస్కారం"- కాంతి పాతూరి, డబ్లిన్
"నారదభక్తి సూత్రాలు"- శ్రీమతి మణి న్యాయపతి, అట్లాంటా
"రాధా-కృష్ణ" - జయదశ్రీ కల్లూర్, ఓవర్లాండ్ పార్కు
“నా మొట్టమొదటి కవిత" - విభాగం విజేతలు
"అంత:కరణ" -రమణి విష్ణుభొట్ల, ఆస్టిన్
"నీకు దూరంగా" -ప్రియాంక మిరియంపల్లి, ఫర్మింగ్టన్ హిల్స్
"28390 హౌరా మైల్" – నసీమ్ షైక్, డల్లాస్
"చిరునామా"- సుశ్మిత శ్రీరామ్, రాంచో కోర్డోవా
ఉత్తమ కథానిక విభాగం విజేతలు
"వీసా" - మహేష్ శనగల, మ్యునిసీ
"స్నేహం-ప్రేమ - పి.వి. భగవతి, లారెన్స్ విల్లే
"జాతక చక్రం"- అపర్ణ గునుపూడి మునుకుట్ల – పాలో ఆల్టో
"అవసరం- వెల్చేరు చంద్ర శేఖర్ – ఇథియోపియా
"తోటలోకి రాకురా" - రేణుకా అయోల - హ్యూస్టన్
ఉత్తమ కవిత విభాగం విజేతలు
"సంభవామి యుగే, యుగే" - స్వాతి శ్రీపాద, యూనియన్ సిటీ
"ముద్దుల బాధ్యత ఒక రక్షణ కంకణం-నారాయణ గరిమెళ్ళ, రెస్టోన్ )
"అస్తమయం" - మూర్తి మధిర, పోర్ట్‌ల్యాండ్
"నేనెవర్ని దేవుణ్ణి ప్రశ్నించడానికి"- మద్దూరి శివప్రసాద్ - పోప్లర్ బఫ్