అమెరికాలో ఎన్నారైల దండి యాత్ర

1930 మార్చి 12వ తేదీ మహాత్మాగాంధీ దండియాత్రను నిర్వహించారు. దాని స్ఫూర్తిగా ఎన్నారైలు అవినీతికి వ్యతిరేకంగా దండియాత్ర - 2ను ప్రారంభించారు. ఈ సందర్భంగా భారతదేశంలో 12 నగరాల్లో, భారతదేశం వెలుపల 20 నగరాల్లో ఈ యాత్ర జరుగుతుంది. సీనియర్ పౌరులు గాంధీ చేపట్టిన మార్గంలోనే గుజరాత్‌లోని సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు యాత్ర చేస్తారు. రాజకుమార్ సింగ్ నాయకత్వం వహించే ఈ యాత్ర ఏప్రిల్ 6వ తేదీన దండి చేరుకుంటుంది. చిన్నపాటి ఉప్పు సంచులను పార్లమెంటు సభ్యులకు బట్వాడా చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో దాదాపు వంద మంది సమావేశమై దండియాత్ర - 2 విజయవంతం కావాలని ప్రార్థించారు.












Click it and Unblock the Notifications