వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో ఎన్నారై దంపతుల మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Vishwanathan Rajaraman
అమెరికాలో ప్రముఖ బ్రెయిన్‌ క్యాన్సర్‌ నిపుణుడు, న్యూరాలజిస్ట్‌ డాక్టర్‌ విశ్వనాథన్‌ రాజారామన్‌(54), అతని భార్య డాక్టర్‌ మేరీ జే సుందరం (50) విమాన ప్రమాదంలో మృతి చెందారు. ప్రవాస భారతీయుడైన డాక్టర్‌ రాజారామన్‌ తమిళనాడుకు చెందిన వారు. దంపతులిద్దరూ న్యూజెర్సీలో స్థిరపడ్డారు. రాజారామన్‌ హాకెన్‌సాక్‌ విశ్వవిద్యాలయ వైద్య కేంద్రంలో నాడీసంబంధ కేన్సర్‌ విభాగాధిపతి. బ్రెయిన్‌ క్యాన్సర్‌ శస్త్రచికిత్సలో అధునాతన పద్ధతులు ప్రవేశపెట్టారు. మేరీ జే సుందరం స్త్రీ వ్యాధుల నిపుణురాలు. అయితే, ప్రస్తుతం ఆమె వైద్య సేవలు అందించటంలేదని న్యూజెర్సీ స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎగ్జామినర్స్‌ వెబ్‌సైట్‌ పేర్కొంది.

దంపతులిద్దరూ వాషింగ్టన్‌లో ఉన్న తమ ఏకైక కుమార్తె కావ్య విశ్వనాథన్‌ వద్దకు తమ సొంత విమానంలో వెళ్లివస్తూ శుక్రవారం సాయంత్రం మార్గమధ్యలో కొలంబస్‌లో ఆగారు. ఆదివారం ఉదయం 9 గంటలకు తమ సింగిల్‌ ఇంజిన్‌ విమానం సిరస్‌ సీఆర్‌22కు రికెన్‌బేకర్‌ విమానాశ్రయంలో ఇంధనం నింపుకొన్నారు. ఆ తర్వాత బయలుదేరిన రెండు నిమిషాలకే సమీప పంటపొలంలో విమానం కూలిపోయిందని ఓహియో రాష్ట్ర పోలీస్‌ అధికారులు వెల్లడించారు.

ప్రమాద సమయంలో డాక్టర్‌ విశ్వనాథన్‌ స్వయంగా విమానం నడుపుతున్నారని, నలుగురు ప్రయాణించటానికి వీలున్నప్పటికీ దంపతులిద్దరే ప్రయాణిస్తున్నారని పోలీసులు తెలిపారు. వీరి కుమార్తె కావ్య విశ్వనాథన్‌ (24) తాను రాసిన నవలతో 2006లో సంచలనం సృష్టించారు. ''హౌ ఒపల్‌ మెహతా గాట్‌ కిస్డ్‌, గాట్‌ వైల్డ్‌, అండ్‌ గాట్‌ ఈ లైఫ్‌'' నవల రచనకు ఆమె గ్రంథ చౌర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి.

English summary
NRI doctors couple dead in USA in aplane accident. Doctor Vishwanathan Rajaraman was from chennai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X