ఎన్నారై నిత్య పెళ్లి కొడుకు, భార్య దాడి

గుంటూరులోని పెళ్లికి వస్తున్నాడని తెలుసుకుని బిజెపి మహిళా కార్యకర్తలను, మీడియాను వెంటేసుకుని ఆమె, ఆమె బంధువులు అతను ఉన్న చోటికి వచ్చారు. శివశంకర్ రెడ్డి 14 ఏళ్ల క్రితం విమలను పెళ్లి చేసుకుని 12 రోజులు కాపురం చేసి అమెరికా ఉడాయించాడు. తాను అమెరికా వెళ్లి వీసా ఏర్పాట్లు చేస్తానని చెప్పాడు. ఆ తర్వాత అటువంటి ఏర్పాట్లు ఏమీ చేయలేదు. అతనిపై గుంటూరు అర్బన్, రూరల్ పోలీసు స్టేషన్లకు వెళ్లితే, తమ పరిధిలోకి రాదంటూ పోలీసులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు ఇద్దరు కానిస్టేబుళ్లను ఇచ్చారు. శివశంకర్ రెడ్డి ఓ మంత్రి బంధువు కావడం వల్లనే పోలీసులు పట్టించుకోవడం లేదని విమల విమర్శిస్తోంది. శివశంకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈమని శివశంకర్ రెడ్డి అమెరినకాలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications