వాషింగ్టన్‌లో క్యాట్స్ దసరా, దీపావళి సంబరాలు

NRI
ఆంధ్ర ప్రదేశ్‌ను సిస్టర్ స్టేట్‌గా ఆమోదించిన అమెరికాలోని మేరిలాండ్ స్టేట్, వాషింగ్టన్ డిసి. ఓ సంధ్యా సమయపు సాయంత్రాన రివ్వు రివ్వున వీచే గాలుల సవ్వడికి జల జల రాలే ఆకుల సవ్వడి తోడవ్వగా అక్టోబర్ 15న అమెరికా రాజధాని వాషింగ్టన్ నగరం దసరా దీపావళి సంబరాలకు సన్నద్ధమయ్యింది. మేరిల్యాండ్ స్టేట్‌కు హౌస్ ఆఫ్ డెలిగేట్స్‌గా ఎన్నికైన మొట్టమొదటి తెలుగు మహిళ అరుణ మిల్లర్ జ్యొతి ప్రజ్వలనతో శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమం గణపతి దేవుని పంచరత్నమాలతో మొదలై పిదప చిన్నారుల చిట్టి శ్లోకాలు,చిట్టిపాపల విభిన్న నృత్యాలు,యువతీ యువకుల నాట్య విలాసాలు, వారి కోయిల గానాలతో ఆద్యంతం సంబరాలకు విచ్చేసిన 750 మంది ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.

ముఖ్య అతిధులుగా విచ్చేసి మేరిల్యాండ్ రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ రాజన్ నటరాజన్, అరుణ మిల్లర్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని మేరిల్యాండ్ సోదర రాష్ట్రంగా మేరిల్యాండ్ గవర్నర్ ఆమోదించిన ప్రకటనను సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఈ ప్రక్రియలో భాగంగా గవర్నర్ త్వరలో ఆంధ్ర ప్రదేశ్ దర్శించి ఈ ఒడంబడికను కుదుర్చుకోనున్నట్టు చెప్పారు. కాపిటల్ ఏరియా తెలుగు సొసైటీ అధ్యక్షులు కొండా రామ్మోహన్ దసరా/దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని మేరిల్యాండ్ సోదర రాష్ట్రంగా గుర్తించినందులకు హర్షం వ్యక్తం చేస్తూ రాజన్ నటరాజన్‌కు అరుణ మిల్లర్‌కు తెలుగు ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. వైస్ చైర్మన్ భువనేష్ బుజాల శుభాకాంక్షలు తెలుపుతూ క్యాట్స్ సంస్థ విధి విధానలు వివరించారు. తరువాత కల్చరల్ డైరెక్టర్ చంద్ర కాటుబోయిన ఆధ్వర్యంలో జరిగిన వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో చిన్నారుల నుంచి పెద్దల వరకు క్రిక్కిరిసిన సభా ప్రాంగణమంతా ఆద్యంతం రక్తి కట్టించాయి.

అనూజ్ గురువార జన సమ్మోహనం,కౌసల్య స్వర మాధుర్యం,రేవంత్ రెచ్చిన వైనం, సినీతారలైన రజిత ఒలికించిన హాస్యం, యామిని శర్మ నర్తించిన మహిషాసుర మర్ధిని నృత్య రూపకం ,యువ హృదయాల అత్యుత్సాహ ప్రదర్శనలతో సభా ప్రాంగణమంతా దద్దరిల్లింది. ముఖ్య సభ్యులు, కోశాధికారి బద్రి చల్ల, ఆనంద్ బాబు గుమ్మడి, ప్రవీణ్ కట్టంగుర్, బాలాజి, ప్రభాకర్,నరసింహ రెడ్డి,చంద్ర ఈడెం, అపర్ణ,పద్మలత, ప్రమీల, కల్పన, సోమేశ్వర్, అనిల్ రెడ్డి, మధుకర్ వెదిరె తదితరులు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. చివరగా కార్యదర్శి మధు కోల ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపిన అనంతరం జనగణమన జాతీయ గీతాలాపనతో కార్యక్రమాలు జనరంజకరంగా ముగిసాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+