వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చికాగోలో ఎన్నారైల బతుకమ్మ పండుగ

By Pratap
|
Google Oneindia TeluguNews

NRI
ఆమెరికాన్ తెలుగు అసోసియేషన్ (ఆటా), తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ చికాగో (టి. ఏ. జి. సి)వారి ఆద్వర్యంలో ప్రవాసంద్రులు (ఎన్నారైలు) దసరా ఉత్సవాలు, బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఇల్లినొఇస్ రాష్ట్రం నలుమూలల నుండి అమెరికా వలస వచ్చిన 500 పైగా తెలుగువారు అంతా కలిసి చికాగో లోని ఆరోర వెంకటేశ్వరా స్వామి ఆలయ ప్రాంగణం లో బతుకమ్మ, దసరా పండుగలను శనివారం రోజు సెప్టెంబర్ 9వ తేదీన చేసుకున్నారు. ఈ వేడుకలు శనివారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో ఘనంగా జరిగాయి.

మధ్యాహ్న భోజనం ఆరగించిన తరువాత, మహిళలు సంప్రదాయబద్దంగా రంగు రంగుల పట్టు వస్త్రాలు దరించి, అందంగా అలంకరించిన రంగు రంగుల బతుకమ్మలతో చికాగో వాసులకు కన్నుల విందు చేసారు. పిల్లలు, పెద్దలు చేరి బతుకమ్మ పాటలతో సాయంత్రం వరకు ఆడి, గౌరమ్మ తల్లికి పూజ చేసి తరువాత వారి వారి బతుమ్మలను మేలా తాళాలు, భజంత్రి లతో గుడి కొలనులో ఒదిలారు.

ఈ పండుగల సందర్బంగా పిల్లలకు వివిధ ఆటల పోటీలు నిర్వహించారు. విజేతలైన పిల్లలందరికి ఆటా వ్యవస్త్హపకులు హన్మంత్ రెడ్డి, జిఎల్ఎన్ రెడ్డి గార్లు బహుమతులను అంద చేసారు. సాయంత్రం గుడి పూజారి సుభద్రాచార్యులు వచ్చిన వారందరితో దస్తూరి వ్రాయించి, జమ్మి వృక్షానికి ఆయుధ పూజ చేసారు. వచ్చిన వారందరకి పూజ చేసిన కంకణాల కట్టి ఆశీర్వదించి, ప్రసాదం పంచారు. పిల్లలు జమ్మి ఆకులను పంచి పెద్దల నుండి ఆశీర్వాదం తీసు కొన్నారు. అందరికీ జమ్మి ఆకులను పంచి పరస్పరం ఆశీర్వాదం తీసు కొన్నారు. ఈ వేడుకలు భారత దేశం లోని దసరా ఉత్సవాలని మరిపించాయని పలువురు ప్రశంసించారు.

ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ కరుణాకర్ మాధవరం, టిఎజిసి ప్రెసిడెంట్ ఎలెక్ట్ కల్యాణ్ అనందుల, బతుకమ్మ కార్య నిర్వాహకుడు శ్రీనివాస్ సరికొండ ఈ వేడుకకు విచ్చేసిన ఆతిథులకు, ధాతలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

English summary
ATA organized Dusheera and Bathukamma festival celebrations in Chicago.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X