వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌కు వేధింపులంటూ ఎన్నారైల సంతకాల సేకరణ

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై సిబిఐ దాడులను వ్యతిరేకిస్తూ కొంత మంది ఎన్నారైలు మద్దతు కూడగడుతున్నారు. ప్రజల నుంచి సంతకాలు సేకరించి ఓ వినతిపత్రాన్ని రాష్ట్రపతికి సమర్పించేందుకు సిద్ధపడుతున్నారు. ఆ వినతిపత్రాలను ప్రధానికి, సుప్రీంకోర్టుకు కూడా సమర్పిస్తారు. అందుకు వారు ఓ లేఖ రాశారు. దాన్ని ఇక్కడ యధాతథంగా ఇస్తున్నాం -

మా ఉద్దేశంలొ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరుగుతున్న నేటి సిబిఐ ధర్యాప్తు కాంగ్రెస్స్, టిడీపిలు కలిసి ఆడుతున్న ఒక కుటిల రాజకీయ క్రీనీడ మాత్రమే. ఎప్పుడైతె జగన్మొహన్ రెడ్డి కాంగ్రెస్ని వదిలి, కడపలో ఘనమైన, మహత్థరమైన, చారిత్రాత్మికమైన విజయాన్ని సాధించాడొ కాంగ్రెస్, టిడీపీలు, కొంతమంది మీడీయా పెద్దలు జగన్ని రాజకీయంగా ఎదుర్కొనలేమనే నిర్ణయానికొచ్చి, భారత దేశంలొనె మొట్టమొదటి సారిగా అధికారంలో లేని ఒక వ్యక్తి పైకి అన్ని ధర్యాప్తు సంస్థలను అడ్డు పెట్టుకుని సాగిస్తున్న కుట్ట్రపూరిత, మోసపూరిత ఎత్తుగడగా మేము భావిస్తున్నాం.

వైఎస్సార్ వైఎస్ జగన్లకున్న ప్రజాబలాన్ని చూసి ఓర్చుకోలేక అడ్డమైన దారులు తొక్కుతున్న ఈ పార్టీలని, ఈ మీడియా పెద్దల్ని నిలువరించాల్సిన చారిత్మాత్మిక అవసరాన్ని మీరంతా గుర్తించాలి. ఒక వ్యక్తిపైనే కాకుండా, గడచిన 25 సంవత్సారాలలొ అధికారం చెలాయించిన మంత్రులందరి మీదా ధర్యాప్తు చేయించమని మేము సవినయంగా మనవి చేసుకుంటున్నాం!

మీరు సంతకం చేయండి, మీ స్నేహితులకి సంతకం చేయమని ఫార్వర్డ్ చేయండి. ఈ పిటిషన్ని ప్రధానమంత్రికి, దేశాద్యక్షురాలికి, భారత ప్రధాన న్యాయమూర్తికి పంపుదాం - మన హక్కుల్ని పరిరక్షించుకుందాం!

- శంకర్ బండి, గురవా రెడ్డి, రామి ఆల్ల, హరిప్రసాద్ రెడ్డి, డాక్టర్ రాఘవ, డాక్టర్ వాసుదేవ, చందు తాల్ల, రఘు పైడి, నంద గోపీనాథ్ రెడ్డి, శివ మట్టిపల్లి, డాక్టర్ కోటి సరిపల్లి, సీవి రెడ్డి, సుబ్బా రెడ్డి, మహమ్మద్ ఆరిఫ్.

English summary
NRIs from USA are prepared to collect public opinion in support of YSR Congress party president YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X