డల్లాస్‌లో ఎన్నారైల టెన్నిస్ టోర్నీ

NRI
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (టాంటెక్స్), నార్త్ టెక్సాస్ అండ్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఐఎఎన్‌టి) సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవల అమెరికాలోని డల్లాస్‌లో టెన్నిస్ టోర్నమెంట్ జరిగింది. తెలుగు ఎన్నారైల్లోనే కాకుండా భారత సంతతికి చెందినవారిలో ఫిట్నెస్‌ను, క్రీడాస్ఫూర్తిని పెంపొందించడానికి ఈ టోర్నమెంటును నిర్వహించారు. జులై 8,9 తేదీల్లో జరిగే టాంటెక్స్ 25 వార్షికోత్సవాలను పురస్కరించుకుని ఈ పోటీలను నిర్వహించారు. టోర్నీలో 26 సింగిల్స్ జట్లు, 14 డబుల్స్ జట్లు పాల్గొన్నాయి. దీనికి దాదాపు వంద వంది ఎన్నారైలు హాజరయ్యారు.

టాంటెక్స్ యువజన, క్రీడా కమిటీ చైర్ కృష్ణ కోరాడ స్వాగతం చెప్పారు. క్రీడా కమిటీ సభ్యుడు మహేష్ ఆదిభట్ల ఆట నియమాలను వివరించారు. టాంటెక్స్ అధ్యక్షుడు ఎన్ఎంఎస్ రెడ్డి తమ సంస్థ అందిస్తున్న సేవలను వివరించారు. ఐఎఎన్‌టి ప్రెసిడెంట్ ఎలెక్ట్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి కొర్సపాటి క్రీడల్లో పెద్ద యెత్తున పాల్గొనాలని భారత ఎన్నారైలకు పిలుపునిచ్చారు. పోటీల్లో గెలవడం, ఓడడం ముఖ్యం కాదని, క్రీడాస్ఫూర్తిని అలవరుచుకోవడమే ముఖ్యమని ఐఎఎన్‌టి సంయుక్త కార్యదర్సి బల్కి చంకుర అన్నారు. టాంటెక్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ గీతా దమ్మన్న జెండా ఊపి పోటీలను ప్రారంభించారు.

సింగిల్స్ పోటీల్లో శశిధర్ ఉరిమిడి విజేతగా నిలిచారు. గోకుల్ నూనే రెండో స్థానంలో నిలిచారు. డబుల్స్‌లో మధు మల్లు, కిశోర్ కసక్ విజయం సాధించగా, లక్ష్మీకాంత్, ఎలెక్స్ రాజా జంట రెండో స్థానంలో నిలిచింది. పోటీల్లో పాల్గొన్నవారికి కోరాడ కృతజ్జతలు తెలిపారు. నోట్యోంకు చెందిన మనోహర్ వజ్జా, డాక్టర్ కొర్సపాటి, చంకుర, ఎన్ఎంఎస్ రెడ్డి, ఉదయ్ బి పెంటకొట, డాక్టర్ నరసింహారెడ్డి ఉరిమిడి విజేతలకు ట్రోఫీలు అందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+