జయశంకర్‌కు తెలంగాణ ఎన్నారైల సంతాపం

Telangana NRIs pay tribute to Jayashankar
తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్‌ మృతికి అమెరికాలోని తెలంగాణ ఎన్నారైలు సంతాపం ప్రకటించారు. ఆయన సంతాపసభను స్ఫూర్తిసభగా భావించి నిర్వహించారు. జయశంకర్ జీవితానుభవాల నుంచి స్ఫూర్తి పొందే విధంగా ఈ సభ జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, దాన్ని సంపద్వంతం చేయడానికి తాము జయశంకర్ వారసత్వాన్ని స్వీకరిస్తామని ఎన్నారైలు చెప్పారు. పేద ప్రజల అభివృద్ధికి జయశంకర్ నిరంతరం కృషి చేశారని వారన్నారు. జయశంకర్ వారసత్వాన్ని కొనసాగించడానికి ఆయన పేర ఓ సంస్థను గానీ ఫౌండేషన్‌ను గానీ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో వారున్నారు. ఈ సంతాప సభను బావర్చి రెస్టారెంటులో నిర్వహించడానికి అనుమతించిన మాధవ రెడ్డికి వారు కృతజ్ఝతలు తెలిపారు. ఒయు ఆర్ట్స్ కళాశాల మాజీ అధ్యక్షుడు డాక్టర్ ధశమంత్ రెడ్డి్కి, శరత్ చంద్రా రెడ్డి, విశ్వేశ్వర్ కాల్వలలకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (టిడిఎఫ్) డెట్రాయిట్ అమెరికా చాప్టర్ ఈ నెల 24వ తేదీ జయశంకర్ సంతాప సభను నిర్వహించారు. టిడిఎఫ్ డెట్రాయిట్ చాప్టర్ మిచిగాన్‌లోని నార్త్‌విల్లేలో ఈ సంతాపసభ జరిగింది. వంద మందికిపైగా ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ సాధించాలనే జయశంకర్ కలను సాకారం చేయడానికి ముందుకు రావాల్సిందిగా ఎన్నారైలు తెలంగాణ నాయకులను కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధనే జయశంకర్ మృతికి అర్పించే నిజమైన నివాళి అని వారన్నారు. అమెరికాలో టిడిఎఫ్‌ను ఏర్పాటు చేయడంలో జయశంకర్ నిర్వహించిన కీలకమైన పాత్రను వారు నెమరేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+