తెలుగు విద్యార్థి మృతి: శవపరీక్షలు

ఇదిలా వుంటే, అమెరికాలోని ఓక్లహామా ప్రాంతంలో రోడ్డుప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన యువకుల మృతదేహాలను భారతదేశానికి పంపేందుకు తానా అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. జి.ఫణీంద్ర, ఎ.అనురాగ్, రావికంటి శ్రీనివాస్, మద్దాల వెంకట్రావుల మృతదేహాలు గురువారం రాత్రి 2.55 గంటలకు ఎమిరేట్స్ విమానం ఇకె0524లో హైదరాబాద్ చేరుకుంటాయని తానా అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ సమాచారం అందించారు.
అలాగే, సుబ్బయ్యగారి జశ్వంత్‌రెడ్డి మృతదేహాన్ని ఎమిరేట్స్ విమానం ఇకె0568లో గురువారం రాత్రి 3 గంటలకు బెంగళూరు పంపుతున్నట్లు తెలిపారు. ఐదుగురు తెలుగు యువకులు ఓక్లహామాలో ఈనెల పదో తేదీన రోడ్డు ప్రమాదంలో మరణించడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. తానా అధ్యక్షుడు తోటకూర ప్రసాద్, ఈవీపీ నన్నపనేని మోహన్, వ్యవస్థాపక ట్రస్టీ జి.శ్రీనివాస్, టీమ్ స్క్వేర్ కమిటీ చైర్‌పర్సన్ లావు అంజయ్య చౌదరి మృతుల కుటుంబసభ్యులు, స్నేహితులను ఓదార్చారు.
మృతదేహాలను భారత్‌కు పంపేందుకు పలువురు వాలంటీర్లు తానా టీమ్‌స్క్వేర్‌కు సహకరించారు. మంగళవారం సాయంత్రం రహ్మా ఫ్యునరల్ హోంలో జరిగిన కార్యక్రమంలో తానా ప్రతినిధులు మృతుల ఆత్మశాంతికి ప్రార్థనలు చేశారు. భారత రాయబారి తరఫున కాన్సల్ జనరల్ పి.హరీష్ మృతుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.












Click it and Unblock the Notifications