వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విదేశాల్లో వైయస్సార్ వర్ధంతి

By Pratap
|
Google Oneindia TeluguNews

NRI
హైదరాబాద్: విదేశాల్లో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి వర్దంతిని నిర్వహించారు. ఆస్టేలియాలోని మెల్బోర్న్‌లో గల మెడీనా హోటల్లో ఎన్నారైలు వైయస్ వర్ధంతిని నిర్వహించారు. సాక్షి టీవీ మా రాజు పేర వైయస్ రాజశేఖర రెడ్డిపై నిర్మించిన డాక్యుమెంటరీని ఈ సందర్బంగా ప్రదర్సించారు.

రమణారెడ్డి కంజుల అతిథులకు స్వాగతం చెప్పి, వైయస్ జీవితం ప్రాముఖ్యాన్ని వివరించారు. వైయస్ ప్రజల గుండెలను స్పృశించారని ఆయన అన్నారు. వైయస్ ధైర్యసాహసాల గురించి, నాయకత్వ లక్షణాలపై జయదీష్, నవ చైతన్యా రెడ్డి వివరించారు. లక్షలాది మందిని వైయస్ తన కుటుంబ సభ్యులుగా మార్చుకున్నారని వారన్నారు. పేదలకు, వికలాంగులకు, తదితర అణగారిన వర్గాలకు వైయస్ ఆత్మబంధువు అయ్యారని వారన్నారు.

వైయస్ వంటి మహా నాయకుడు ఇంతకు ముందు జన్మించలేదు, మళ్లీ పుట్టబోరని, వైయస్ లేని లోటును ఎవరూ పూరించలేరని, వైయస్ వంటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్టానికి ఇంతకు ముందు ఎవరూ లేరని పుల్లారెడ్డి, జీవన్, శివ, ప్రసాద్ అన్నారు.

మహానేత వైయస్ రాజశేఖర రెడ్డి తృతీయ వర్ధంతిని అమెరికాలోని అట్లాంటాలో ఎన్నారైలు నిర్వహించారు. ఈ నెల 8వ తేదీన ఈ కార్యక్రమం జరిగింది. వైయస్ నాయకత్వ లక్షణాలను, వైయస్‌తో తమకు గల అనుబంధాన్ని కార్యక్రమానికి వచ్చినవారు గుర్తు చేసుకున్నారు. వైయస్ చిత్రపటానికి పూలమాలలు వేసి, రాగి ముద్దలు పెట్టి నివాళులు అర్పించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

English summary
The greatest telugu leader and champion of masses, late chief minister of Andhra Pradesh, Dr.Y.S. Rajasekhara Reddy gari vardhanthi was observed on September 11, 2012 at Medina Hotel Melbourne Australia. People attended the event to pay tributes to Athmabandhu Dr.YSR.The heart touching documentary showing the life story of Dr. YSR “Maa Raaju” compiled by Sakshi TV was presented during the event.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X