అమెరికాలో విశిష్టంగా వైయస్ వర్ధంతి

DrYSR Vardhanthi in Los Angeles Mission
లాస్ ఏంజెలెస్: వైయస్ ఫ్యాన్ క్లబ్ విశిష్టమైన రీతిలో అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో వైయస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించింది. అందరూ గుర్తుంచుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. వైయస్ ఫ్యాన్ క్లబ్ అధ్యక్షుడు వీరారెడ్డి నంద్యాల నేతృత్వంలో వైయస్ అభిమానులు లాస్ ఏంజెలెస్‌లోని మిషన్‌లో సమావేశమయ్యారు.

ఈ నెల 2వ తేదీన వైయస్ ఫ్యాన్ క్లబ్ వేయి మందికి తాజా, వేడి ఆహారాన్ని అందించింది. వైయస్ అభిమానులు మిషన్‌లోనివారిని తమ పొరుగువారిగా, మిత్రులుగా చూస్తారని స్టూడెంట్ కౌన్సెలర్ కెన్నెత్ విలియం అన్నారు. మత్తు పదార్థాలకు బానిసలైనవారికి మిషన్ పునరావాసం కూడా కల్పిస్తోంది. చదువు పట్ల ఆసక్తి ఉన్నవారికి అందుకు తగిన సహాయం అందిస్తూ, ఉద్యోగాలు పొందడంలో సహకరిస్తుందని చెప్పారు.

వైయస్ జ్ఞాపకార్థం ఆహారం అందించడం గొప్ప అవకాశమని వీరా రెడ్డి అన్నారు. మిషన్‌కు వైయస్ అభిమానులు , అనుచరులు సహాయం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. తమ నాయకుడి అమరత్వాన్ని శాశ్వతం చేయడానికి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమానికి డాక్టర్ ప్రేమ్ రెడ్డి ఫ్యామిలీ ఫౌండేషన్ సహకారం అందించింది. కార్జియాలిజిస్టు ప్రేమ్ రెడ్డి దీన్ని స్థాపించారు. ఆయన వైయస్ రాజశేఖర రెడ్డి సన్నిహిత మిత్రుడు కూడా. ఈ కార్యక్రమానికి సహకరించినవారందరికీ వీరా రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. దక్షిణాది కాలిఫోర్నియా తెలుగు సంఘం ప్రెసిడెంట్ ఎలెక్ట్ నాగేశ్వర రావు, నాటా సలహా మండలి సభ్యుడు ధర్మా రెడ్డి గుమ్మడి, రాజా కేశిరెడ్డి,త మాలిక్ ఆర్ బొంతు, వీరబాబు, దేవరకొండ నాగ్, సుధీర్ ఓబుళం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+