వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తానా ఉచిత ఇమిగ్రేషన్ సేవలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Free immigration services by TANA
తెలుగు సమాజం కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఉచిత ఇమిగ్రేషన్ సర్వీసులను అందిస్తోంది. అనుభవజ్ఝులైన నిపుణులు దీనిపై ఉచితంగా సలహాలు ఇస్తారు. ఇషార్ లా ఫర్మ్, పిసి ఇక్బాల్ ఎస్ ఇషార్ ఇమిగ్రేషన్‌పై సలహాలు ఇస్తారు.

ఈ కార్యక్రమం సెప్టెంబర్ 2వ తేదీన ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సుల్లేవాన్‌లో శ్రీ వేంకటేశ్వర స్వామి (బాలాజీ) ఆలయంలో ఉంటుంది. తానా డైరెక్టర్స్ బోర్డు అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర, చైర్మన్ వి చౌదరి జంపాల, కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు మోహన్ నన్నపనేని, డైరెక్టర్లు సుబ్బారావు ఉప్పులూరి, మణి అక్కినేని ఈ కార్యక్రమానికి సహకారం అందిస్తున్నారు.

ఇమిగ్రేషన్ స్టేటస్ గురించి హక్కులను తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం పనికి వస్తుందని తానా ప్రతినిధులు అంటున్నారు. హెచ్1బి రెఫ్, వీసా స్టాంపింగ్, ఎఫ్1- స్టూడెంట్ వీసా నియమనిబంధనలు, ఆడిట్ - పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ వంటి పలు విషయాలపై ఈ కార్యక్రమానికి వచ్చేవారు సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

1977లో తెలుగు ప్రజలు అమెరికాలోని న్యూయార్క్‌లో తానాను ఏర్పాటు చేసుకున్నారు. ఇండో - అమెరికన్ సంస్థల్లో ఎంతో ముందుగా ఆవిర్భవించిన సంస్థ తానా. అంతేకాకుండా ఇండో అమెరికన్ సంస్థల్లో పెద్దది కూడా.

English summary
TANA is organising free immigration services to entire community. Telugu Association of North America (or TANA, as it is well known) is the oldest and biggest Indo-American organization in North America. TANA was founded at a convention in New York in 1977 of Telugus from all over North America and was incorporated in 1978 as a not-for-profit organization.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X