అమెరికా ఎన్నికల్లో భారత సంతతి అమీ బేరా గెలుపు

అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికైన భారత సంతతికి చెందిన మూడో వ్యక్తిగా అమీ బెరా రికార్డ్ సృష్టించారు. న్యూజెర్సీ అసెంబ్లీ ఉప సభాపతి చివుకుల ఉపేంద్ర ఈ ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. కాగా అమెరికా ఎన్నికల ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మరోసారి ఘన విజయం సాధించారు.
45 ఏళ్ల అమీ బెరా డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేశాడు. ఇతను రిపబ్లికన్ అభ్యర్థిపై 184 ఓట్లతో విజయం సాధించారు. బెరా 50.1 శాతం ఓట్లు దక్కించుకోగా, ఆయన ప్రత్యర్థి డాన్ లుంగ్రేన్ 49.9 శాతం ఓట్లను దక్కించుకున్నారు. బెరా 88,406 ఓట్లు దక్కించుకున్నారు. లుంగ్రేన్ 88,222 ఓట్లు పొందారు.












Click it and Unblock the Notifications