ఉద్దానం గ్రామాల దత్తతకు ఎన్నారైలు

ప్రతి గ్రామంలోనూ సగం మంది మూత్ర పిండాల సమస్యతో బాధపడుతున్నట్లు ఆయన గుర్తించారు. దాంతో ప్రతి నెల ఐదారు మంది చనిపోతున్నట్లు ఆయన దృష్టికి వచ్చింది. మృతుల్లో 12 ఏళ్ల వయస్సు లోపు పిల్లలు కూడా ఉన్నారు. వారిలో చాలా మంది దినసరి కార్మికులు. చికిత్సకు డబ్బులు లేక, దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో గల ఆస్పత్రులకు ప్రయాణఖర్చులు భరించలేక వారు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు.
వారి దయనీయ పరిస్థితిని గమనించి, ఇచ్చాపురం శానససభ్యుడు పి. సాయిరాజ్ నేతృత్వంలోని ఉద్దానం ఫౌండేషన్‌తో కలిసి నాట్స్, గజల్ చారిటబుల్ ట్రస్టు పీడిత గ్రామాల్లో 40 లక్షల రూపాయల వ్యయంతో డయాలసిస్ సెంటర్, బ్లడ్ బ్యాంక్, 3 ఆర్ఓ వాటర్ ప్లాంట్లను స్పాన్సర్ చేయాలని నిర్ణయించినట్లు నాట్స్ ఉద్దానం హెల్ప్ లైన్ ఓవర్సీస్ ఇంచార్జీ రమణమూర్తి గులివిందల చెప్పారు.












Click it and Unblock the Notifications