హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నోబెల్ రేసులో నెల్లూరు తెలుగు తేజం

By Srinivas
|
Google Oneindia TeluguNews

NRI scientist MS Reddy nominated to the Nobel prize
హైదరాబాద్: నోబెల్ శాంతి బహుమతికి శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లాకు చెందిన తెలుగుతేజం పోటీ పడుతోంది. నెల్లూరు జిల్లా కొవూరు సమీపంలోని ఉప్పలపాడులో జన్మించిన ఎంఎంస్ రెడ్డి పేరును 2012 శాంతి బహుమతికి గాను అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో గల వివిధ సంస్థలతో పాటు భారత్, అమెరికా విశ్వవిద్యాలయాలు నామినేట్ చేశాయి. ప్రపంచ శాంతి, ఆకలిదప్పులు తీర్చడం, వ్యాధుల నిర్మూలన, కాలుష్య నివారణ, అభాగ్యులకు చేయూత తదితర అంశాల్లో నోబెల్ శాంతి బహుమతి ఇస్తారు. ప్రతిష్ఠాత్మకమైన ఈ బహుమతి కోసం నామినేట్ అయిన యాభై మందిలో ఆయన కూడా ఉన్నారు.

శాంతి పురస్కారానికి పరిశీలనలో ఉన్న మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్ వంటి వారితో కూడిన జాబితాలో ఎంఎస్ రెడ్డి పేరు ఉంది. ఆయన పూర్తి పేరు మలిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి. ఎంఎస్ రెడ్డి పరిశోధనలవల్ల ఆహార ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని, ప్రపంచంలో ఆకలి బాధను తగ్గించడంలో ఆయన విశేష కృషి చేశారని ఆ సంస్థలు పేర్కొన్నాయి. అనేక వ్యాధుల నిర్మూలనకు ఆయన పరిశోధనలు ఉపయోగపడ్డాయని, ఆయన అభివృద్ధి పరచిన అప్లికేషన్లతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు లక్ష కోట్ల డాలర్ల ఆదాయం సమకూరిందని పేర్కొన్నాయి.

పేదల కోసం వందల కోట్ల డాలర్లు ఖర్చుచేస్తూ ఎంఎస్ రెడ్డి అనేక సేవా కార్యక్రమాలకు చేయూతను అందిస్తున్నట్లు నోబెల్ కమిటీ దృష్టికి తీసుకొచ్చాయి. ఎంఎస్ రెడ్డి తిరుపతిలోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత అమెరికాలోని ఐవా స్టేట్ విశ్వవిద్యాలయం నుంచి ఫుడ్ టెక్నాలజీ, మైక్రో బయాలజీలో ఎంఎస్, పిహెచ్‌డి చేశారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 70 అంతర్జాతీయ సంస్థలకు టెక్నికల్ కన్సల్టెంట్‌గా పనిచేసి ఉత్తమ శాస్త్రవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలోని డైరీ, ఫుడ్ కన్సల్టింగ్ లేబొరేటరీ సంస్థ (అడ్‌ఫాక్ ల్యాబ్స్) చైర్మన్‌గా ఉన్నారు.

వందకు పైగా అంతర్జాతీయ అవార్డులు ఆయనను వరించాయి. అమెరికా ఉపాధ్యక్షుడు, భారత ప్రధాని చేతుల మీదుగా కూడా ఆయన పురస్కారాలు అందుకున్న సందర్భాలున్నాయి. దాదాపు 150 అంతర్జాతీయ పేటెంట్లు ఆయన సొంతం. శాస్త్రీయ పరిశోధనలపై ఎంఎస్ రెడ్డి రాసిన పలు ఆర్టికల్స్ వివిధ సైన్స్ మేగజైన్లలో ప్రచురితమయ్యాయి. కీస్ టు విన్నింగ్, ఎ టు జెడ్ ఆఫ్ సక్సెస్ వంటి పుస్తకాలను ఆయన రచించారు.

English summary
Dr MS Reddy has been nominated for 2012 Nobel Peace Prize. The other outstanding nominees for 2012 Nobel Peace Prize from US include former President Bill Clinton, Microsoft Chairman and the world's richest man Bill Gates etc.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X