జెపి సురాజ్య దీక్షకు ఎన్నారైల సంఘీభావం

హైదరాబాదులో జెపి దీక్ష చేపట్టననాడే అమెరికాలోని న్యూజెర్సీలో సుధీర్ రెడ్డి పంటా దీక్షతో ఎన్నారైల కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. జన చైతన్య దీక్షకు సంఘీభావం ప్రకటిస్తూ తమ సభ్యులు పెద్ద యెత్తున ఇందులో పాల్గొనాలని పీపుల్స్ ఫర్ లోకసత్తా (పిఎఫ్ఎల్) విపి మీడియాకు చెందిన దినేష్ పగడాల పిలుపునిచ్చారు. 26 మందిలో ఒక్కరైన రజని కరుతూరి - విషయం సరైందని భావించినప్పుడు మిగతా వారితో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనాలని, దాని వల్ల ఆధ్యాత్మిక భావన వంటిది కలుగుతుందని, మౌనం, శాంతి లభిస్తుదంని, అది సమస్యకు పరిష్కారం చూపుతుందని అన్నారు.
ఇతర ఎన్నారైలు, పెన్సిల్వేనియాకు చెందిన బ్రాహ్మణి బొప్పుడి, వర్జీనియాకు చెందిన విష్ణు శృంగారానికి, కాంగోకు చెందిన బాలాజీ కాట్రగ్డడకు, మిస్సిసిపికి చెందిన వెంకట్ పెందుర్తికి, చికాగోకు చెందిన శ్రీపాల్ సామాకు, కాలిఫోర్నియాకు చెందిన రవీంద్ర నందం,త వరమ్ దంతులూరిలకు, బోస్టన్‌కు చెందిన చంద్ర సేఖర్ రాజు, ప్రదీప్ చుక్కపల్లిలకు, వాషింగ్టన్ డిసికి చెందిన రఘురావ్ తాడిమల్ల, వెంకట్ మామిళ్లపల్లిలకు, తదితరులకు పిఎఫ్ఎల్ ప్రశంసలు అందించింది.
నిరాహార దీక్షలో పాల్గొన్న చాలా మంది ఇదివరకు దైవ ప్రార్థనలో కూడా ఉపవాసం చేసి ఉండరని, 24 గంటలు నిరాహారదీక్ష చేయడం వారి దేశభక్తిని చాటుతోందని దినేష్ అన్నారు. హైదరాబాదులో ఉన్న పిఎఫ్ఎల్ సభ్యులు పద్మ భూపతిరాజు, హైమా సాగి, దిలీప్ శంకర్ రెడ్డి, శ్రీనివాస్ రణబోతు జయప్రకాష్ నారాయణతో పాటు దీక్షలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications