వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కోలుకుంటున్న తెలుగు విద్యార్థి

ప్రవీణ్ రెడ్డిని కత్తులతో పొడిచిన వాళ్లలో నిశాంత్ పుట్టపాక ముఖ్యుడని ప్రవీణ్ రెడ్డి కుటుంబ సభ్యులు చెప్పారు. నిశాంత్ కుటుంబ సభ్యులతో ప్రవీణ్ రెడ్డి కుటుంబ సభ్యులకు దూరం బంధుత్వం ఉంది. ఇరు కుటుంబాల మధ్య ఆస్తి తగాదా ఉన్నట్లు చెబుతున్నారు. కొత్తపేటలోని యూనివర్శల్ ఓవర్సీస్ సర్వీస్ ద్వారా నిశాంత్, ప్రవీణ్ రెడ్డి ఒకేసారి యుకెకు వెళ్లారు.
ప్రవీణ్ రెడ్డి ఫోన్ చేసి నిశాంత్ గురించి చెడుగా ఏమీ చెప్పలేదని, అయితే ఆస్తి తగాదా కారణంగా నిశాంత్ కక్ష పెంచుకుని ఉంటాడని అంటున్నారు. నిశాంత్ పుట్టపాక పాస్‌పోర్టును కన్సల్టెన్సీ సర్వీసు నుంచి తీసుకున్నారు. నల్లగొండ జిల్లాలోని భువనగిరి ఆర్‌బి నగర్‌లో నిశాంత్ తండ్రి నరేంద్ర రావు ఉంటున్నారు.