వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫిలడెల్ఫియాలో తెలంగాణ ఉత్సవం

By Pratap
|
Google Oneindia TeluguNews

Philadelphia Telangana Cultural Night
ఫిలడెల్ఫియా తెలంగాణ సంఘం (పిటిఎ) శనివారం ఈ నెల 9వ తేదీన ఫిలడెల్ఫియా తెలంగాణ సాంస్కృతిక ఉత్సవాన్ని నిర్వహించింది. ఈ ఉత్సవాన్ని ప్రతి యేటా నిర్వహిస్తామని పిటిఎ ప్రతినిధులు చెప్పారు. ఈ ఉత్సవంలో దాదాపు 400 మంది తెలంగాణవారు పాల్గొన్నారు. ఉత్సవంలో భాగంగా పిల్లల కార్యక్రమాలు, తెలంగాణ సంప్రదాయ సంగీత నృత్య కార్యక్రమాలు జరిగాయి. వర్ష, నారయణ స్వామి యాంకర్లుగా వ్యవహరించారు. వారు తెలంగాణ యాసలో ప్రేక్షకులను అలరించారు. భిన్న రుచుల తెలంగాణ వంటకాలు కూడా అలరించాయి.

స్మోక్ టీవీ పేరుతో తెలుగు టీవీ చానెళ్లపై వ్యంగ్య ప్రదర్శన విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. మాధవ మోసర్ల, రమేష్ కంకటి, వెంకట్ మాదిపడగ దీన్ని ప్రదర్శించారు. రమేష్ కంకటి మిమిక్రీ, వేణు ఏనుగుల, శ్రవంత్ పోరెడ్డి, శ్రీని కొంపల్లి తెలంగాణ గేయాలు వీనుల విందు చేశాయి. తొలి పిటిఎ తెలంగాణ సంబరాల సందర్భంగా సింగిడి అనే పత్రికను వెలువరించారు. దాన్ని ప్రొఫెసర్ జయశంకర్‌కు అంకితం ఇచ్చారు.

సింగిడిలో తెలంగాణకు చెందిన రచయితలు, కవులు, మేధావుల రచనలు చోటు చేసుకున్నాయి. ముఖ్య అతిథి సీతారామా రావు సంచికను విడుదల చేశారు. తమ సంస్థ చేపట్టిన కార్యక్రమాలను పిటిఎ ప్రతినిధి మేరెడ్డి రవి వివరించారు. తెలంగాణలో, తెలంగాణ వెలుపల, విదేశాల్లో తెలంగాణ కోసం జరుగుతున్న కృషిని ఆయన వివరించారు.

మధు రెడ్డి, మురళీ చింతలపాటి (టిడిఎఫ్ అధ్యక్షుడు), వెంకట్ మారోజు, అమర్ కర్మిల్ల (తెనా), రవి పొట్లూరి (టిఎజిడివి), ధనుంజయ్ (చిన్మయ మిషన్), మాధవ మోసర్ల (ఆటా), రాఘవ రెడ్డి ఘోశాల (నాటా), గిరిధర్ మాసిరెడ్డి (బాల గోకులం), ఉదయ్ కొమ్మా రెడ్డి తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

స్పాన్సరర్స్‌కి, వాలంటీర్లకు, ముఖ్యంగా పవన్ తిరునహరి, మాధవ్ చెలుక, సుధీర్ రాజు సతీష్ సుంకనపల్లి, భాను తోట, సౌందర్య మేరెడ్డిలకు గూడాల కృతజ్ఞతలు తెలిపారు. యాంకర్లు నారాయణ స్వామి, వర్ష బియ్యాల, చిత్ర మోసర్ల, సమీర్‌లకు కూడా కృతజ్ఞతలు తెలిపారు.

English summary
In the first event of its kind, the Philadelphia Telangana Association (PTA), hosted the “Philadelphia Telangana Cultural Night” on Saturday, June 9th, 2012 at Great Valley High School, Malvern PA. It is more important than ever to provide such cultural and community event in today’s ever changing scenario.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X