సౌదీ అరేబియాలో తెలుగువాడి మృతి

ప్రమాదంలో గాయపడిన రాజేందర్‌ను కింగ్ ఖలీద్ ఆస్పత్రిలో చేర్చారు. అతడి ఆరోగ్యం కాస్తా మెరుగు పడడంతో ఐసియు నుంచి జనరల్ వార్డుకు మార్చారు. అయితే ఆరోగ్యం క్షీణించి అతడు ప్రాణాలు వదిలాడు. రాజేందర్ మృతదేహాన్ని స్వదేశానికి పంపిస్తామని భారత దౌత్య కార్యాలయం అధికారులు తెలిపారు. మృతుడి కుటుంబానికి కంపెనీ నుంచి పరిహారం ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. రాజేందర్‌ను కారుతో ఢీకొట్టిన 22 ఏళ్ల సౌదీ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications