వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వర్జీనియాలో వైయస్సార్ వర్ధంతి

By Pratap
|
Google Oneindia TeluguNews

YSR 3rd Vardhanthi observed in Washington DC, USA
వాషింగ్టన్ డీసీ: అమెరికా దేశ రాజధాని వాషింగ్టన్ డీసీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహానేత మూడో వర్థంతి సభను గడచిన 15వ తేదీ శనివారం ఉదయం 10.30 గంటలకు వర్గీనియాలోని ఫ్రయింగ్ పాన్ ఫారం పార్క్ ఆడిటోరియంలో ఘనంగ్గా నిర్వహించారు. మధ్యాహ్నాం నలుగు గంటల వరకు ఈ సభని నిర్వహించి సభని కమ్మని భోజనాలతో ముగించారు. ఈ కార్యక్రమానికి ఆయన అభిమానులు 400 మందికి పైగా హాజరై ఘన నివాళులు అర్పించారు.

వైఎస్ రాజశేఖరరెడ్డికి ముఖ్య అతిథి మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి, మాజీ ఎంపీ జ్ఞానేంద్ర రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ నంద్యాల ఇంచార్జీ ఏ వి సుబ్బా రెడ్డి, ఏ వి ప్రసాద్, రమేష్ రెడ్డి, వల్లూరు జ్యోతి ప్రజ్వలన చేసి ఘననివాళి అర్పించిన తర్వాత కార్యాక్రమాన్ని ప్రారంభించారు. జననేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితం వీశేషలపై ప్రత్యకంగా రూపొందించిన "వైఎస్సార్ - ఒక చరిత్ర "వీడియోను ఈ సందర్భంగా ప్రదర్శించారు. దీంతో వైఎస్సార్ అభిమానులందరు తమ నేత లేని లోటుని కన్నీటి రూపంలో నివాళులు అర్పించారు.

సామాన్య ప్రజల గుండెల్లో జననేత ఎలా కొలువున్నది "బ్రతికున్నా...మీ గుండెల్లో!" రమేష్ రెడ్డి సభికులకు ఈ సందర్భంగా వివరించారు. రఘు కడసాని వైఎస్సార్ రాజసం గురించి సభికులకు చక్కగా వర్ణిచారు . సుధాకర్ రెడ్డి, నర్సి రెడ్డి , శశి బండ్లపల్లి - అనేక మంది పేద ప్రజల అభ్యన్నతి కోసం ఆయన అహార్నిశలు శ్రమించారనివారు తెలిపారు. మహానేత ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ఆయన తుది శ్వాస విడిచే వరకు ప్రజలకు అందించేందుకు కృషి చేశారని ఎన్నారైలు తెలిపారు.. పరిపాలన దక్షతకు, రాజనీతిజ్ఞ్ఞతకు దివంగత మహానేత నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు.

రాజశేఖరరెడ్డి మరణించి అప్పుడే మూడేళ్లు గడుస్తున్నా ఆయన లేరనే విషయాన్ని ఎవరూ నమ్మలేకపోతున్నారు. ప్రజలు ఆయన్ను తమ మనసుల్లో గుడిలోకంటే ఎక్కువగా పదిలం చేసుకున్నారని జ్ఝానేంద్ర రెడ్డి అన్నారు. "మూడేళ్లకే ఎంత మార్పు... వైఎస్ హయాంలో అభివృద్ధి పరుగులు తీసింది. ప్రజా సంక్షేమం విరాజిల్లింది. పాలన ఆదర్శవంతంగా సాగింది. మహానేత వైఎస్ శ్వాస, ధ్యాస ప్రజా సంక్షేమమే.. ఊపిరి ఆగిపోయేంతవరకు ప్రజల కోసమే పరితపించారు.. ఆందుకే ఆయన జనహృదయాల్లో దేవుడిలా కొలువు దీరారు.. ఆగిపోయిన ఆ మహర్షి ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంద"ని ఏవి సుబ్బా రెడ్డి తెలిపారు.

వైఎస్సార్ గారిని చరిత్రలో తెలుగు జాతి ఉన్నంత కాలం మహానేత , దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కీర్తి ప్రతిష్టలు చిరస్థాయిగా నిలిచి ఉంటాయని భూమా నాగిరెడ్డి వెల్లడించారు. వైఎస్సార్ ప్రజలకు చాలా చేయాలనుకున్నారు. వారికేం చేయాలనుకున్నా వేగంగా ఆలోచించేవారు, "పేదలకు మేలు జరిగే ఏ నిర్ణయంలోనూ ఆలస్యం కూడదన్న గాంధీ హితవే ఆయనకు స్పూర్తి. 1978లో రాజకీయాల్లోకి వచ్చారు. 1983 తర్వాత 21 ఏళ్లు పెద్దగా పదవులేమీ లేవు. అయినా ఏనాడూ ఆయన ప్రజలకు దూరం కాలేదు. రాష్ట్రంలో ఆయన తిరగని ప్రాంతమే లేదు. ఏ ఊరికి ఏ రోడ్డు వెళ్తుందో తెలుసాయనకు. చిన్న చిన్న ఊళ్లన్నీ కూడా ఆయనకు గుర్తే. కొన్ని లక్షల మందిని పేర్లు పెట్టి పిలిచేంత జ్ఞాపకశక్తి అని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చిన ఆ వైఎస్ కుటుంబంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని వారు ఈ సందర్భంగా తప్పు పట్టారు.పేద ప్రజల సంక్షేమం కోసం ఆహర్నిశలు కృషి చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అడుగుజాడల్లో నడిచి, జగన్ సమర్థవంతమైన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి చేస్తారని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ప్రజల అండతో 2014లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్ హాయంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని తెలిపారు.

శ్రీనివాసరెడ్డి సోమవరపు వైఎస్సార్, జగన్ మీద పాటలు పాడి, కవితలు చదివి వినిపించారు. వర్జీనియా, మేరీలాండ్, వాషింగ్టన్ డీసీ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అభిమానులు "వైఎస్ రాజశేఖరరెడ్డి అమర్ రహే, జై జగన్" నినాదాలతో హోరుగా సందడి చేశారు. వందలాది మంది ప్రవాసాంధ్రులు యువనేత వైఎస్ జగన్ స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరిట సమీప భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని వాషింగ్టన్ డీసీలోని ఎన్నారైలు ఈ సందర్భంగా తెలిపారు

ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించిన రమేష్ రెడ్డి వల్లూరు, రఘు కడసాని, నినాద్ అన్నవరం, రాజీవ్ రాజోలు, అమర్ కటికరెడ్డి, మరియు శ్రీనివాస్ అనుగు లకు ప్రత్యెక దన్యవాదములు తెలిపారు. చివరగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాషింగ్టన్ డి.సి చాప్టర్ నాయకుడు రమేష్‌రెడ్డి వల్లూరు వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.

English summary
Dr. Y S Rajasekhara Reddy fans from all over USA especially from Washington D.C. Metro (Maryland, Virginia, Washington DC) witnessed at Frying Pan Park Auditorium in Virginia on Saturday, September 15th 2012 to Commemorate Sri Y. S. Rajasekhara Reddy's third death anniversary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X