వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహాసభలకు ఆటా ఏర్పాట్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

 ATA kick - starts preparation of 13th conference
ఫిలడేల్ఫియా: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) రెండు వార్షిక బోర్డు సమావేశం ఈ నెల 6వ తేదీన విల్లింగ్టన్ డిఎలో జరిగింది. ఆటా బోర్డు సభ్యులతో పాటు అమెరికాలోని తెలుగు ప్రజలు పెద్ద యెత్తున ఈ సమావేశానికి హాజరయ్యారు. కమ్యానిటీ సర్వీస్ కార్యకలాపాలపై 13వ ఆటా మహాసభల సన్నాహాకాలపై ఈ సమావేశంలో చర్చించారు. సమావేశానికి 300 మందికిపైగా హాజరయ్యారు.

సమీరా శ్రీపాద ప్రార్థనా గీతంతో, కార్యదర్శి అనంత్ రెడ్డి పజ్జూరు స్వాగతోపన్యాసంతో సమావేశం ప్రారంభమైంది. తెలుగు ప్రజలకు తాము చేస్తున్న సేవల గురించి, తాము చేపట్టిన కార్యక్రమాల గురించి ఆటా అధ్యక్షుడు కరుణాకర్ ఆర్ మాధవరం వివరించారు. అమెరికాలో అడపడుచులు పేర తాము నిర్వహించిన తొలి మహిళా దినోత్సవాలను ఆయన గుర్తు చేశారు. యేటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, ఆ కార్యక్రమంపై ఆటా ముద్ర వేస్తుందని ఆయన చెప్పారు.

ఆటా వేడుకల నిర్వహణకు అవసరమైన ప్రణాళిక గురించి ఆయన వివరించారు. తెలుగు సంస్కృతి, వారసత్వ వైభవాలను చాటడంతో పాటు సేవా కార్యక్రమాలపై ఆటా దృష్టి పెడుతుందని ఆయన చెప్పారు. నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో ఆటా వేడుకలు నిర్వహించాలని బోర్డు సమావేశం నిర్ణయించింది.

గత త్రైమాసికంలో ఆటా ఆర్థిక పరిస్థితి గురించి కోశాధికారి నరేందర్ చేమర్ల వివరించారు. సేవా కార్యక్రమాలకు విరాళాలు అందించడానికి ముందుకు రావాలని ఆయన కోరారు. 13వ ఆటా మహాసభలకు ఆటా అడ్‌హాక్ కమిటీలోని మిగిలిన ఆరు స్థానాలకు బల్వంత్ కొమ్మిడి, వినోద్ రెడ్డి కోడూరు, రామో మోహన్ కొండా, సత్య కందిమల్ల, సతీష్ రెడ్డి, అజయ్ రెడ్డిలను బోర్డు సమావేశం ఏకగ్రీవంగా నామినేట్ చేసింది.

బోర్డు సమావేశం తర్వాత 2014 ఆటా మహసభలు జరిగే పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌ను సందర్శించారు. ఆటా మహాసభలు, యువ సమ్మేళనం 2014 జులై 3-5 తేదీల్లో జరుగుతుంది. సాయంత్రం పూట వినోద కార్యక్రమాలు జరిగాయి. భాస్కరి, సిధు బుద్ధవరపు, కృష్ణ - లలిత, విద్యా నారాయణస్వామి- వేణు యేనుగుల తెలుగు పాటలు ఆలపించారు. రాజ్ సలీం ఏకపాత్రాభినయం చేశాడు.

ఆ తర్వాత ఆటా - 2014 కన్వీనర్ పరమేష్ భీమ్‌రెడ్డి మాట్లాడారు వాలంటీర్స్ టీమ్‌ను పరిచయం చేశారు. వాషింగ్టన్ డిసి మెట్రో వాలంటీర్స్ టీమ్‌ను మహాసభల కోఆర్డినేటర్ భునేష్ బూజల పరిచయం చేశారు. టిఎజిడివి అధ్యక్షుడు రవి పొట్లూరి ఈ సందర్భంగా మాట్లాడారు.

పరమేష్ భీమ్‌రెడ్డి, భువనేష్ బూజల, మాధవ్ మోసర్ల, కృష్ణ ద్యాపా, గోవింద్ కొడకింది, వెంకట్ మందిపడగ, , కిరణ్ ఆలా, ఉదయ్ కొమ్మిరెడ్డి, ప్రశాంత్ గుడుగుంట్ల, శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలోని ఫిలడేల్ఫియా బృందానికి ఆటా బృందం కృతజ్ఞతలు తెలిపింది.

English summary

 American Telugu Association (ATA) held its seconf annual board meeting in Wilmgton.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X